English | Telugu
షారుఖ్ పై సంచలన కామెంట్స్ చేసిన నటి
Updated : Oct 3, 2023
దశాబ్దంన్నర కాలం క్రితం ఆమె హీరోయిన్ గా తెలుగు ,తమిళ భాషలకి సంబంధించిన సినిమాల్లో నటించి అద్భుతమైన నటిగా ప్రేక్షకుల మన్ననలను అందుకుంది.అంతే కాకుండా ఏ కొంత మందికో మాత్రమే సాధ్యమయ్యే జాతీయ అవార్డు ని సైతం ఉత్తమ నటి కేటగిరిలో పొంది నేషనల్ లెవెల్లో తన పేరు మారుమోగిపోయేలా చేసుకుంది.ప్రస్తుతం క్యారక్టర్ రోల్స్ లో నటిస్తూ తన నటనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించింది.పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ఆ నటి ఇటీవల ఒక బాలీవుడ్ బాద్షా షారుఖ్ గురించి సంచలన వ్యాఖ్య చేసింది.
అసలు విషయం లో కి వస్తే..ప్రియమణి ఎంత అందంగా ఉంటుందో అంతే అందంగా తన నటన ఉంటుంది.ఏ పాత్రలో అయినా ఒదిగిపోయే ప్రియమణి తెలుగులో జగపతి బాబు,నాగార్జున ఎన్టీఆర్ ల సరసన అలాగే తమిళంలో విక్రమ్ లాంటి పెద్ద హీరోల సరసన కూడా నటించి అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్ రేంజ్ కి వెళ్ళింది.ఆ తర్వాత తన సినిమా కెరీర్ పెద్దగా సాగలేదు. దాదాపు కొన్ని సంవత్సరాలు నటనకి దూరంగా ఉండి లేటెస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక రేంజ్ ఉన్న సినిమాల్లో నటిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
లేటెస్టుగా ప్రియమణి షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసింది.వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జవాన్ మూవీ లో చాలా ప్రాముఖ్యత ఉన్న క్యారక్టర్ లో నటించి సినిమా విజయంలో తను కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించింది తాజాగా ప్రియమణితో ఒక జర్నలిస్ట్ మీ క్రష్ ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఏ మాత్రం తడుముకోకుండా షారుఖ్ ఖాన్ నా క్రష్ అని సమాధానం ఇచ్చి అందర్నీ షాక్ కి గురి చేసింది. కొంత మంది అయితే పెళ్లి అయ్యి పిల్లలు ఉన్న ప్రియమణి అలా చెప్పడంతో ప్రియమణి కి గట్స్ ఎక్కువే అని అనుకుంటున్నారు.