English | Telugu

జ్యోతిష్యుల మాటలు విని, స్టార్ హీరో పతనం

హిందీ చిత్ర రంగంలో ఎవర్ గ్రీన్ హీరోగా 'గోవిందా'(Govinda)కి ప్రత్యేక స్థానం ఉంది. డాన్స్ అండ్ కామెడీ లో తిరుగులేని   పేరు సంపాదించుకున్న గోవిందా 1986లో 'లవ్ 86 'తో పరిచయమయ్యాడు. అదే సంవత్సరం వచ్చిన 'తాన్ బదన్' గోవిందాకి మంచి హిట్ ని అందించింది. ఇల్జామ్, మార్తే దామ్ తక్, ఖుద్గర్జ్ , దరియా దిల్, జైసీ కర్ణి వైసీ భర్ణి, స్వర్గ్ హమ్ ఇలా సుమారు 160 చిత్రాలకి పైనే నటించి అశేష అభిమానులని సంపాదించాడు.  చివరిగా 2019 లో 'రంగీలా రాజా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

గోవిందా గురించి రీసెంట్ గా ప్రముఖ నిర్మాత, సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు పహ్లాజ్ నిహలాని(Pahlaj Nihalani)మాట్లాడుతు 'గోవిందా ఒక అల్ రౌండర్, డాన్స్ యాక్టింగ్ లలో తనకి తిరుగులేదు. కెరీర్ ఆరంభంలో వరుస సినిమాలు చేస్తు విజయాల్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఎదుటి వ్యక్తుల్ని సులభంగా నమ్మడంతో పాటు, జ్యోతిష్యులు, పండితుల మాటలని ఎక్కువగా నమ్మడం వలన కెరీర్ పరంగా దెబ్బతిన్నాడు. పార్టనర్ తర్వాత చాలా సినిమాలు ఆగిపోయాయి. ఆ సమయంలో డైరెక్టర్ డేవిడ్ ధావన్ తో వర్క్ చెయ్యడంతో సరికొత్త గోవిందా కనపడ్డాడు. అదే విధంగా గోవిందా సింగల్ స్క్రీన్ హీరో. మల్టిప్లెక్స్ వచ్చాక సినిమా రిలీజ్ కాలేదని పహ్లాజ్ చెప్పుకొచ్చాడు.

ఫిలింఫేర్ అవార్డులతో పాటు,ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డుల్ని అందుకున్న గోవిందా 2004 ,2009 నుంచి కాంగ్రెస్(Congress)తరుపున ఎంపీ గా పని చేసాడు. ప్రస్తుతం శివసేన(Sivasena) పార్టీలో కొనసాగుతు వస్తున్నాడు.