Read more!

English | Telugu

మళ్లీ మలైకా ఐటం సాంగ్!

 

పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ మూవీ 'గబ్బర్ సింగ్‌'లో "కెవ్వు కేక" సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. ఆ పాటలో పవన్‌తో కలిసి స్టెప్పులేసిన మలైకా అరోరా తెలుగు ఆడియెన్స్ మనసులను దోచుకుంది. ఆ పాటకంటే ముందే మహేశ్ బాబు 'అతిథి' మూవీలో "రాత్రైనా నాకు ఓకే" పాటతోనూ ఆమె అలరించింది. ఇక హిందీలో మణిరత్నం 'దిల్‌సే' సినిమాలో "ఛల్ ఛయ్యా ఛయ్యా" సాంగ్‌తో, సల్మాన్ ఖాన్ మూవీ 'దబాంగ్‌'లో "మున్నీ బద్నాం హుయీ" పాటతో దేశవ్యాప్తంగా ఐటం గాళ్‌గా పాపులర్ అయ్యింది. 

కొంత కాలంగా తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తోన్న మలైకా, సినిమాల్లో కనిపించి చాలా రోజులైపోయింది. చివరగా విశాల్ భరద్వాజ్ సినిమా 'పఠాకా' (2018)లో "హల్లో హల్లో" అనే సాంగ్ చేసింది. ఇన్నాళ్ల తర్వాత ఆమె మరో స్పెషల్ సాంగ్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ యాన్ యాక్షన్ హీరోలో ఆమె ఓ ఐటం సాంగ్‌లో కనిపించనుంది. అనిరుధ్ అయ్యర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఆమె సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఆమె సాంగ్ షూటింగ్ పూర్తయింది.

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను 1998లో వివాహం చేసుకున్న మలైకా 2017లో విడాకులు తీసుకుంది. 2002లో వారికి అర్హాన్ ఖాన్ అనే కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఆమె అర్జున్ కపూర్‌తో ప్రేమలో నిండా మునిగి ఉంది.