Read more!

English | Telugu

అర్జున్‌కు 'యస్' చెప్పిన మలైక!

 

అర్బాజ్ ఖాన్‌తో 17 సంవత్సరాల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పింది మలైకా అరోరా. తామిద్దరం విడిపోతున్నామని 2016లో చెప్పిన ఆ ఇద్దరూ 2017లో చట్టబద్ధంగా డివోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత తన కంటే వయసులో బాగా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో మలైకా డేటింగ్ చేస్తోందనే ప్రచారం ప్రారంభమైంది. డిన్నర్ డేట్స్, సీక్రెట్ వెకేషన్స్‌తో ఆ ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు.

2019 జూన్ 16 అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తామిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామనే విషయాన్ని వారు బహిర్గం చేశారు. తాజాగా అందాల మలైకా తన జీవితంలోని బిగ్గెస్ట్ న్యూస్‌లో ఒక దాన్ని అనౌన్స్ చేసింది. నవంబర్ 10న తన స్టన్నింగ్ పిక్చర్‌ను ఒకదాన్ని ఇన్‌స్టాగ్రాం ద్వారా పోస్ట్ చేసిందామె. ఫొటో కంటే దానికి పెట్టిన క్యాప్షన్ ఎక్కువగా ఆకర్షింది. ఐ సెడ్ యస్ అనేది ఆ క్యాప్షన్.

సో.. అర్జున్ ఆమెకు మ్యారేజ్ ప్రపోజల్ చేశాడనీ, మలైకా దానికి యస్ చెప్పిందనీ అర్థమైపోతోంది. 2022 ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డేకి అర్జున్ కపూర్‌తో ఉన్న ఓ పిక్చర్‌ను మలైకా షేర్ చేసింది. ఆ ఫొటోలో అర్జున్‌ను మలైకా కౌగలించుకొని కళ్లు మూసుకొని వుంటే, ఆమె నుదుటిపై అర్జున్ ముద్దు పెడుతున్నాడు. ఆ ఫోటోకు నావాడు అని క్యాప్షన్ పెట్టింది మలైకా.