Read more!

English | Telugu

సినీ పరిశ్రమలో విషాదం.. లెజెండరీ సింగర్ కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. లెజెండరీ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న పంకజ్ ఉధాస్ మరణించినట్లు సోమవారం ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

1951 మే 17న జన్మించిన పంకజ్ ఉధాస్ 20 ఏళ్ళ వయసులోనే సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. 1970లో విడుదలైన 'తుమ్ హసీన్ మెయిన్ జవాన్' చిత్రంలోని 'మున్నేకి అమ్మా యేతో బాటా' అనే పాటలో గాయకుడిగా బాలీవుడ్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 1980లో 'ఆహత్' అనే గజల్ ఆల్బమ్‌తో ఆయన కెరీర్ ఊపందుకుంది.  'నామ్'(1986) మూవీలోని 'చిట్టి అయి హై' సాంగ్ మెమొరబుల్ హిట్ గా నిలిచి ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చింది. గజల్ కళాకారుడిగా, నేపథ్య గాయకుడిగా సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన పంకజ్ ఉధాస్.. 2006లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.