Read more!

English | Telugu

ఆ రీమేక్ లో ర‌ణ్ వీర్ కి జోడీగా కియారా?

చియ‌న్ విక్ర‌మ్ - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అనియ‌న్` (2005). తెలుగులో `అప‌రిచితుడు` పేరుతో అనువాద‌మైన ఈ త‌మిళ చిత్రం.. త్వ‌ర‌లోనే హిందీనాట రీమేక్ కానుంది. బాలీవుడ్ `అప‌రిచితుడు`గా ర‌ణ్ వీర్ సింగ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ని.. ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ రీమేక్ ని ప్రొడ్యూస్ చేయ‌నుంద‌ని ఇప్ప‌టికే కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ని తెర‌కెక్కించిన శంక‌ర్.. ఈ రీమేక్ కి కూడా మెగాఫోన్ ప‌ట్టొచ్చ‌ని వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ర‌ణ్ వీర్ సింగ్ కి జోడీగా ఉత్త‌రాది భామ కియారా అద్వానిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని బ‌జ్. ఒరిజిన‌ల్ లో  స‌దా పోషించిన పాత్ర‌లో కియారా అయితేనే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే `అపరిచితుడు` హిందీ రీమేక్ లో కియారా ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, ప్ర‌స్తుతం కియారా చేతిలో `షేర్ షా`, `భూల్ బూల‌య్య 2`, `జ‌గ్ జ‌గ్ జియో` వంటి హిందీ సినిమాలు ఉన్నాయి. వీటిలో `షేర్ షా` జూలై 2న విడుద‌ల కానుండ‌గా.. `భూల్ బూల‌య్య 2` న‌వంబ‌ర్ లో రిలీజ్ కానుంది.