Read more!

English | Telugu

సిద్ధార్థ్ పుట్టిన‌రోజు...కియారా ఏం గిఫ్ట్ ఇచ్చింది?

సిద్ధార్థ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అంద‌రూ విష్ చేశారు. హ్యాపీ బ‌ర్త్ డే సిద్ అని విష్  చేశారు ర‌ష్మిక‌. నీ అద్భుత‌మైన యాక్టింగ్ స్కిల్స్ తో ఫ్యాన్స్ మ‌న‌సుల‌ను రూల్ చేస్తున్నావు అంటూ విష్ చేశారు ప‌లువురు. అంద‌రి సంగ‌తి స‌రే, ఇంత‌కీ మేడ‌మ్ ఎలా విష్ చేశారు? బ‌ర్త్ డే కి మేడం ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఇప్పుడు ఎక్క‌డ విన్నా ఇదే మాట‌.త‌న 38వ బ‌ర్త్ డే జ‌రుపుకున్నారు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా. ఆయ‌న ప్రేయ‌సి, త్వ‌ర‌లోనే ఇల్లాలు కాబోతున్న కియారా అద్వానీ ఏం గిఫ్ట్ ఇచ్చార‌నే టాపిక్ బాగా వైర‌ల్ అయింది. 

సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ఇండియ‌న్ పోలీస్ సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అక్క‌డికి కియారా పెద్ద కేక్ పంపారు. ఫ్ల‌వ‌ర్స్ పంపారు. వాటిని సిద్ రిసీవ్ చేసుకోగానే సెట్లో అంద‌రూ ఫుల్ ఖుషీ అయ్యారు. అంద‌రికీ కేక్ పంచిపెట్టారు సిద్‌. అంద‌రూ పెళ్లి గురించి ప్ర‌స్తావించార‌ట‌. తాను కేక్ క‌ట్  చేస్తున్న దృశ్యాల‌ను వీడియో కాల్ చేసి చూపించార‌ట సిద్‌. కియారా అక్క‌డి నుంచే హ్యాపీ బ‌ర్త్ డే పాట అందుకున్నార‌ట‌.

వీరిద్ద‌రూ రాజ‌స్తాన్‌లో వ‌చ్చే నెల వివాహం చేసుకోనున్నారు. అతి కొద్ది మంది స‌మ‌క్షంలో వీరిద్ద‌రి పెళ్లి జ‌ర‌గ‌నుంది. ప్యాండమిక్ టైమ్‌లో వీరు నటించిన షేర్‌షా మూవీ ఎంతో మందిని ఆక‌ట్టుకుంది. స‌రైన క‌థ ఉంటే ఇప్పుడు కూడా క‌లిసి చేయ‌డానికి సిద్ధ‌మేన‌ని చాలా సార్లు చెబుతున్నారు ఈ జంట‌. అటు ర‌ష్మిక‌తో ప‌నిచేస్తున్నారు సిద్. వారి మిష‌న్ మ‌జ్ను ఈ నెలల్లోనే ఓటీటీలో విడుద‌ల కానుంది. తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ తో ప‌నిచేస్తున్నారు కియారా.