Read more!

English | Telugu

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రవీనా టాండన్ కుమార్తె!

రవీనా టాండ‌న్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కూడా మంచు  మోహన్ బాబు సరసన పాండవులు పాండవులు తుమ్మెదా చిత్రంలో నటించారు రవినా టాండన్‌. కేజీయ‌ఫ్‌2లోనూ ర‌వీనా చేసిన రోల్ అంత తేలిగ్గా మర్చిపోలేనిది. సౌత్ ఇండియ‌న్ సినిమాల‌ను నార్త్ లో రిలీజ్ చేయ‌డంలో ర‌వీనా భ‌ర్త అనిల్ త‌డాని బిజీ బిజీ.

ర‌వీనా టాండ‌న్‌, అనిల్ కుమార్త ర‌షాకు ఇప్పుడు 17 ఏళ్లు. ర‌షా  ఇప్పుడు బాలీవుడ్‌లో నటిగా తెరంగేట్రం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ దేవగన్ సోద‌రుడి త‌న‌యుడు అమన్ దేవ్‌గ‌న్‌ కలిసి రషా నటిస్తారనే వార్తలు బాలీవుడ్లో వైర‌ల్ అవుతోంది.  అభిషేక్ క‌పూర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. రష లుక్స్ యూనిక్‌ గా ఉండటంతో అమన్ పక్కన రషా అయితే  పర్ఫెక్ట్ గా ఉంటుందని దర్శకుడు అభిషేక్ కపూర్ భావించారట. ఈ విషయం మీద ఇప్పటికే రవినా టాండ‌న్‌తో మాట్లాడినట్టు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం.

అమ‌న్‌, ర‌షా ఇరు వైపుల నుంచి యాక్సెప్టెన్స్ రావ‌డంతో, వీరిద్ద‌రికి స్పెష‌లు క్లాసులు కూడా మొద‌లుపెట్టేశార‌ట మేక‌ర్స్. కైపోచే, కేదార్‌నాథ్‌, చంఢీగ‌డ్‌, రాక్ ఆన్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్నారు అభిషేక్‌. ఇప్పుడు ఈ లేటెస్ట్ సినిమా గురించి కూడా నార్త్  బిజినెస్ వ‌ర్గాల్లో ఆస‌క్తి మొద‌లైంది. రోనీ స్క్రూవాలా, ప్ర‌గ్యా క‌పూర్ క‌లిసి ఈ ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్నారు. గ‌తంలో అజ‌య్ దేవ్‌గ‌న్‌, ర‌వీనా క‌లిసి హిట్ సినిమాల్లో న‌టించారు. ఇప్పుడు అమ‌న్‌, ర‌షా జోడీ గురించి ప్ర‌స్తావ‌న రాగానే, చాలా మందికి అజ‌య్‌, ర‌వీనా సినిమాలు గుర్తుకొస్తున్నాయి.