English | Telugu

ఊపిరి ఊయలగా సాంగ్.. ఫ్యాన్స్ కి కియారా గ్లామర్ ట్రీట్!

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'వార్ 2'. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న 'వార్ 2'పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ యాక్షన్ ప్రియులను మెప్పించింది. తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ విడుదలైంది.

'వార్ 2' విడుదలకు ఇంకా రెండు వారాలే సమయముంది. దీంతో సాంగ్స్ తో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఫస్ట్ సింగల్ గా 'ఊపిరి ఊయలగా' సాంగ్ ను రిలీజ్ చేశారు. హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై తీసిన ఈ రొమాంటిక్ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

'బ్రహ్మాస్త్ర'లోని బ్లాక్‌బస్టర్ సాంగ్ 'కేసరియా'ని కంపోజ్ చేసిన టీం ఈ రొమాంటిక్ సాంగ్ రూపొందించారు. ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటకు హిందీలో అమితాబ్ భట్టాచార్య లిరిక్స్, అరిజిత్ సింగ్ గాత్రాన్ని అందించారు. ఇక తెలుగులో ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ ఆలపించారు.

'ఊపిరి ఊయలగా' సాంగ్ వినసొంపుగా ఉంది. విజువల్స్ కూడా కలర్ ఫుల్ గా ఉన్నాయి. హృతిక్, కియారా మధ్య బ్యూటీఫుల్ కెమిస్ట్రీ, పాటను తెరకెక్కించిన విధానం, లోకేషన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కియారా పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట.. ఆమె ఫ్యాన్స్ కి ట్రీట్ అని చెప్పవచ్చు. ఈ సాంగ్ లో కియారా బికినీలో దర్శనమిచ్చింది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.