Read more!

English | Telugu

డిసెంబ‌ర్‌లో క‌త్రినా కైఫ్ పెళ్లి?

 

బాలీవుడ్ యాక్ట‌ర్స్ క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ త‌మ రిలేష‌న్‌షిప్ గురించి బ‌య‌ట‌కు పెద‌వి విప్ప‌న‌ప్పటికీ, ఆ ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం ప్రేమ‌లో ఉన్నార‌ని ఇండ‌స్ట్రీ అంతా కోడై కూస్తోంది. ఇప్పుడు ఆ ల‌వ్ బ‌ర్డ్స్ త‌మ అనుబంధాన్ని మ‌రో లెవ‌ల్‌కు తీసుకువెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోగా క‌త్రినా, విక్కీ పెళ్లి పీట‌లు ఎక్కాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం. అయితే ఆ ఇద్ద‌రి నుంచి ఎలాంటి అఫిషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. అయితే బాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆ జంట ఇప్ప‌టికే త‌మ పెళ్లి వేడుక‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. వారి పెళ్లి దుస్తుల‌ను స‌వ్య‌సాచి ముఖ‌ర్జీ డిజైన్ చేస్తున్నారు.

"వారి వివాహ దుస్తుల‌ను స‌వ్య‌సాచి డిజైన్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్ర‌స్తుతం ఆ జంట దుస్తుల‌ను ఎంపిక చేసుకొనే ప‌నిలో ఉన్నారు. న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్‌లో పెళ్లి జ‌రుగుతుంది." అని ఆ వ‌ర్గాలు అంటున్నాయి.

క‌ర‌ణ్ జోహార్ 'కాఫీ విత్ క‌ర‌ణ్' షోలో ఆ ఇద్ద‌రి బాడీ లాంగ్వేజ్ చూశాక‌.. క‌త్రినా, విక్కీ డేటింగ్‌లో ఉన్నార‌నే రూమ‌ర్స్ వ్యాపించాయి. విక్కీతో ప‌నిచెయ్యాల‌ని క‌త్రినా కోరుకుంటోంద‌నీ, ఆ ఇద్ద‌రూ చూడ‌చ‌క్క‌గా ఉంటార‌నీ ఆ షోలో క‌ర‌ణ్ జోహార్ అన్న‌ప్పుడు, విక్కీ మూర్ఛ‌పోయిన‌ట్లు న‌టించాడు.

తాము ప్రేమ‌లో ఉన్న‌ట్లు వారు ఎన్న‌డూ అంగీక‌రించ‌క‌పోయిన‌ప్ప‌టికీ, 'జూమ్‌'కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ (అనిల్ క‌పూర్ కొడుకు) "విక్కీ, క‌త్రినా క‌లిసున్నార‌నేది వాస్త‌వం. ఈ విష‌యం చెప్పి నేను ఇబ్బందుల్లో ప‌డుతున్నానా అనేది నాకు తెలీదు. ఈ విష‌యంలో వారు చాలా ఓపెన్‌గా ఉన్నార‌ని అనుకుంటున్నాను" అని చెప్పాడు.