Read more!

English | Telugu

హృతిక్ రోష‌న్‌కి బంధువు కాబోతున్న యంగ్ హీరో!


నార్త్ వాళ్ల‌కే కాదు, సౌత్ వాళ్ల‌కు కూడా చాలా బాగా తెలిసిన పేరు కార్తిక్ ఆర్య‌న్‌. ప్యార్ కి పంచ‌నామా, ఆకాశ‌వాణి, గెస్ట్ ఇన్ లండ‌న్‌, లుకా చుప్పి, ప‌తీ ప‌త్నీ ఔర్ ఓ, ల‌వ్ ఆజ్‌క‌ల్‌2, ధ‌మాకా, భూల్ భుల‌య్యా2 సినిమాల‌తో ఇప్ప‌టికే ఫేమ‌స్ అయిపోయారు కార్తిక్‌. ప్ర‌స్తుతం సెట్స్ మీద 'ఫ్రెడ్డీ', 'షెహ్‌జాదా', 'స‌త్య‌ప్రేమ్ కి క‌థ' సినిమాలున్నాయి.ఏ మాత్రం ఖాళీ దొరికినా  ప‌ష్మినా రోష‌న్‌తో గ‌డపడానికి ఇష్ట‌ప‌డుతున్నారట కార్తిక్ ఆర్య‌న్.

హృతిక్ రోష‌న్‌కి క‌జిన్ అవుతారు ప‌ష్మినా రోష‌న్‌. ఆమె రాజేష్ రోష‌న్ కూతురు. గ‌త కొన్నాళ్లుగా కార్తిన్‌, ప‌ష్మినా మ‌ధ్య ఏదో స‌మ్ థింగ్ స‌మ్‌థింగ్ అంటూ బాలీవుడ్లో గ‌ట్టిగా వార్త‌లు వినిపిస్తున్నాయి.కాసింత తీరిక దొరికితే ప‌ష్మినా ఏకంగా కార్తిక్ ఇంటికి వెళ్లిపోతున్నార‌ట‌. ఒక‌వేళ ప‌ష్మినా వెళ్ల‌క‌పోయినా, ఆమె ప్లేస్‌కి కార్తిక్ వెళ్తున్నార‌ట‌. ఇద్ద‌రూ పాప‌రాజీల కంట ప‌డ‌కుండా బ్యాక్ డోర్ల చుట్టూ తిరుగుతున్నార‌న్న‌ది ముంబై స‌మాచారం.

దీపావ‌ళి రోజు కూడా ప‌ష్మినా ఇంట్లోనే గ‌డిపార‌ట కార్తిక్‌. జియో వ‌ర‌ల్డ్ డ్రైవ్‌లో వీరిద్ద‌రూ త‌ర‌చుగా క‌నిపిస్తున్నార‌ని, కౌ కౌలో లేట్ నైట్లు గ‌డుపుతున్నార‌న్న‌ది యువ‌త‌ను అట్రాక్ట్ చేస్తున్న మ‌రో విష‌యం. 'ఇష్క్ విష్క్' సీక్వెల్ 'ఇష్క్ విష్క్ రీబౌండ్‌'తో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు ప‌ష్మినా. ఆ సినిమా టీమ్‌ను విష్ చేస్తూ ప‌ష్మినా గురించి స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేశారు కార్తిక్‌. కార్తిక్‌, ప‌ష్మినా మ‌ధ్య స‌మ్‌థింగ్ ఉందంటూ న‌మ్మేవారు ఆ విష‌యాల‌ను కూడా షేర్ చేసుకుంటున్నారు.