English | Telugu

కారు యాక్సిడెంట్‌కు గురైన 'క‌చ్చా బాద‌మ్' సింగ‌ర్‌!

'క‌చ్చా బాద‌మ్' సాంగ్ రెండు వారాల నుంచీ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తుండ‌టంతో, ఆ పాట‌ను పాడిన భువ‌న్ బ‌ద్యాక‌ర్ రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ అయిపోయారు. ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్‌కు చెందిన వేరుశ‌న‌క్కాయ‌లు (ప‌ల్లీలు) అమ్ముకొనే వ్య‌క్తి. కాగా సోమ‌వారం భువ‌న్ ఒక కారు యాక్సిడెంట్‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల ఆయ‌న ఒక సెకండ్ హ్యాండ్ కారును కొన్నారు. దానిపై డ్రైవింగ్ నేర్చుకుంటూ ప్ర‌మాదానికి గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న‌ను హాస్పిట‌ల్‌లో చేర్పించారు.

'క‌చ్చా బాద‌మ్' సాంగ్‌కు విప‌రీత‌మైన పాపులారిటీ రావ‌డం, భువ‌న్ ఇంట‌ర్నెట్ సెన్సేష‌న్‌గా మార‌డంతో, ఇటీవ‌ల కోల్‌క‌తాలోని ఓ పేరుపొందిన ప‌బ్‌లో ఆయ‌న‌తో ఆ పాట‌ను పాడించారు. ఆ సూప‌ర్ హిట్ సాంగ్‌పై ప‌లువురు నెటిజ‌న్లు రీల్స్ చేస్తూ వాటిని సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. అనేక‌మంది సెల‌బ్రిటీలు సైతం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 'క‌చ్చా బాద‌మ్' ట్రెండ్‌లో పాలుపంచుకుంటున్నారు.

ఇటీవ‌ల భువ‌న్ బ‌ద్యాక‌ర్ త‌న పాట‌కు డాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ రీల్‌గా అప్‌లోడ్ చేశాడు యాక్ట‌ర్ నీల్ భ‌ట్టాచార్య‌. కొంత‌మందితో క‌లిసి ఆ సాంగ్‌లోని హుక్ స్టెప్ వేస్తూ ఆ వీడియోలో క‌నిపించారు భువ‌న్‌. ఆ వీడియోకు, "ఈ పాట‌ను పాడిన మ‌నిషితో డాన్స్‌.. ఈ మాణిక్యాన్ని స‌పోర్ట్ చేయండి.. ఆయ‌న‌ను క‌లుసుకోవ‌డం సంతోష‌క‌రం" అని క్యాప్ష‌న్ పెట్టాడు నీల్‌.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.