Read more!

English | Telugu

'ప‌ఠాన్' రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్‌.. డెఫినెట్‌లీ కింగ్ ఈజ్ బ్యాక్‌!

 

షారుక్ ఖాన్‌, దీపికా ప‌డుకోనే, జాన్ అబ్ర‌హామ్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న‌ 'ప‌ఠాన్' మూవీ క‌రోనా మ‌హ‌మ్మారి త‌ర్వాత బాక్సాఫీస్‌ను ఢీకొట్ట‌డానికి వ‌స్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ఒక‌టి అన‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు. ఈ హై-ఆక్టేన్ స్పై థ్రిల్ల‌ర్ రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ అనౌన్స్ చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న 'ప‌ఠాన్‌'ను 2023 జ‌న‌వ‌రి 25 (రిప‌బ్లిక్ డే వీక్‌)న రిలీజ్ కానున్న‌ది. ఆ రోజు బుధ‌వారం కావ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. ప్ర‌త్యేకంగా తీసిన ఓ వీడియో ద్వారా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

ఇంట‌ర్నెట్‌ను ఊపేస్తోన్న ఈ వీడియోలో, 'ప‌ఠాన్‌'గా షారుక్ లుక్‌ను ఆస్వాదిద్దామ‌నుకున్న వాళ్ల‌కు కొంత నిరాశ క‌లిగింది. జాన్ అబ్ర‌హాం, దీపిక లుక్స్‌ను రివీల్ చేసిన మేక‌ర్స్‌, షారుక్ లుక్‌ను మాత్రం షాడోలో చూపించారు. ఠీవిగా న‌డుచుకుంటూ వ‌స్తోన్న షారుక్ ఫేస్ క‌నిపించ‌కుండా షాడోలో చూపించిన మేక‌ర్స్‌, చివ‌ర‌లో మెరుపు మెరిసి మాయ‌మైనవిధంగా క‌నిపించీ క‌నిపించ‌కుండా ఫేస్‌ను రివీల్ చేశారు. ఈ మాత్రానికే ఫ్యాన్స్ సంబ‌ర‌ప‌డ్డారు. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనందే తీశాడు. 

ఈ వీడియోను షేర్ చేసిన షారుక్‌, "ఇది చాలా ఆల‌స్య‌మ‌ని నాకు తెలుసు. కానీ ఆ డేట్‌ను గుర్తుంచుకోండి.. ప‌ఠాన్ టైమ్ ఇప్పుడు మొద‌లైంది. 2023 జ‌న‌వ‌రి 25న సినిమా హాళ్ల‌లో క‌లుద్దాం. హిందీ, త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రిలీజ‌వుతోంది. మీ ద‌గ్గ‌ర‌ల్లోని బిగ్ స్క్రీన్‌పై మాత్ర‌మే #YRF50 తో క‌లిసి #Pathaan ను సెల‌బ్రేట్ చేయండి." అని త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో రాసుకొచ్చాడు.