Read more!

English | Telugu

హిందీలో జూనియర్ ఎన్టీఆర్ సంచలన రికార్డు

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సంచలన విజయాన్ని అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ మూవీ హిందీలోనూ సత్తా చాటింది. హిందీలో 200 కోట్ల నెట్ మార్క్ ని దాటిన ఆర్ఆర్ఆర్ 17 రోజుల్లో దాదాపు 230 కోట్ల నెట్ కలెక్ట్ చేసి 250 కోట్ల దిశగా పయనిస్తోంది. దీంతో హిందీలో తారక్ పేరిట సరికొత్త రికార్డు క్రియేట్ అయింది.

హిందీలో విడుదలైన తన మొదటి సినిమాతోనే 200 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ గా తారక్ సంచలన రికార్డు సృష్టించాడు. చరణ్ హీరోగా నటించిన మొదటి హిందీ మూవీ 'జంజీర్' డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రెండో సినిమా 'ఆర్ఆర్ఆర్'తో సత్తా చాటాడు. ప్రభాస్ ఫస్ట్ హిందీ ఫిల్మ్ 'బాహుబలి-1' 118 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప ది రైజ్' హిందీలో 108 కోట్ల నెట్ రాబట్టింది. ఇక యశ్ నటించిన 'కేజీఎఫ్-1' హిందీలో 44 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది.

'బాహుబలి-2'తో ప్రభాస్ హిందీలో 500 కోట్లకు పైగా నెట్ కలెక్ట్ చేసి సంచనలనం సృష్టించాడు. అలాగే విడుదలకు సిద్ధమైన 'కేజీఎఫ్-2'తో యశ్, త్వరలో పట్టాలెక్కనున్న 'పుష్ప ది రూల్' తో బన్నీ 200 కోట్ల నెట్ మార్క్ ని ఈజీగా అందుకునే అవకాశముంది. అయితే మొదటి సినిమాతోనే 200 కోట్లకు పైగా నెట్ రాబట్టిన హీరోగా తారక్ రికార్డు క్రియేట్ చేశాడు.