English | Telugu
'జవాన్' ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగిన ఫ్యాన్స్
Updated : Jul 23, 2023
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ లేటెస్ట్ మూవీ `జవాన్`. సౌతిండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో భారీగా విడుదలకి సిద్ధమవుతుంది. మేకర్స్ గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధం చేస్తున్నారు. రీసెంట్‌గానే ఈ సినిమా ట్రైలర్‌ను `జవాన్ ప్రివ్యూ` పేరుతో రిలీజ్ చేయగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ప్రివ్యూ ఏకంగా 24 గంటల్లో 112 మిలియన్ వ్యూస్‌తో నెంబర్ వన్ ప్లేస్‌లో నిలిచింది. రిలీజ్‌కు ముందే జవాన్ ఇలా రికార్డ్‌తో అడుగులు స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు సాంగ్స్ రిలీజ్ కాలేదు.
ప్రివ్యూలో సన్నివేశాలు చూసి ఆడియెన్స్, ఫ్యాన్స్ వావ్ అనుకున్నారు. మరి పాటలను ఏ రేంజ్‌లో తెరకెక్కిస్తారనేది అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే తాజాగా మేకర్స్ నుంచి ఎలా స్పందనా లేకపోవటంతో ఇక లాభం లేదనుకున్నారేమో ఏకంగా షారూఖ్ ఖాన్ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. `జవాన్` సినిమా నుంచి తొలి పాట 26 జూలై రిలీజ్ కానుందని ప్రమోషన్స్ మొదలు పెట్టారు. `జిందా` అనే పాటను జవాన్ దర్శక నిర్మాతలు విడుదల చేస్తారని ఫ్యాన్స్ ప్రమోషన్స్ షురూ చేయటంతో అదే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. `జవాన్`లో పాటలను వైభవి మర్చంట్, ఫరహ్ ఖాన్, శోభి మాస్టర్స్ కంపోజ్ చేస్తున్నారు.
అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న జవాన్ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంటే, విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ డైరెక్టర్. షారూఖ్ మాత్రం జవాన్‌ను ఎక్కువగా సౌతిండియా ఫ్లేవర్‌తో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పఠాన్ సినిమా తర్వాత అదే రేంజ్ హైప్‌తో జవాన్ రిలీజ్ కానుంది. మరి తొలి రోజున జవాన్ సినిమా ఏ మేరకు వసూళ్లను సాధిస్తుందో చూడాలని ట్రేడ్ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.