English | Telugu

ఇప్ప‌టికింకా బోర్ కొట్ట‌డం లేదంటున్న క‌రీనా!

త‌న‌కు ఇప్ప‌టిదాకా బోర్ కొట్ట‌లేద‌ని అంటున్నారు క‌రీనా క‌పూర్‌. త‌న‌కిప్పుడు 43 ఏళ్ల‌ని, ఇప్ప‌టికైతే ఇంకా ఎగ్జ‌యిటింగ్‌గానే పార్టిసిపేట్ చేస్తున్నాన‌ని చెబుతున్నారు. ఇంత‌కీ దేని గురించి ఇలా ఊరిస్తున్నార‌ని అడిగితే ఇంట్ర‌స్టింగ్ విష‌యాల‌నే రివీల్ చేశారు. ఆమె న‌టించిన మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ జానే జాన్ విడుద‌ల‌కు రెడీ అయింది. ఈ ప్రాజెక్టుతో ఆమె డిజిట‌ల్‌లో ముంద‌డుగు వేసిన‌ట్టే. విజ‌య్ వ‌ర్మ‌, జైదీప్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ ప్రాజెక్టు గురించీ, పర్స‌న‌ల్ లైఫ్ గురించీ చాలా విష‌యాలు పంచుకున్నారు బెబో. ఆమె మాట్లాడుతూ ``నాకు న‌ట‌నంటే ఇంకా ఎగ్జ‌యిటింగ్‌గానే ఉంది. నాకు సెట్స్ కి వెళ్తుంటే ఆనందంగా అనిపిస్తోంది. కెమెరా ముందు నిలుచున్న ప్ర‌తిసారీ ఉత్సాహం వ‌స్తోంది. మేక‌ప్ లో మెళ‌కువ‌లు తెలుసుకుంటుంటే విద్యార్థిలా మారిపోతున్నాను. ఇవ‌న్నీ లేని రోజు ఒక రోజు ఉంటే, ఆ రోజు చెప్పులేసుకుని సెట్స్ నుంచి వెళ్లిపోతాను. ఆ త‌ర్వాత మ‌ల్లీ కనిపించ‌ను. ఎందుకంటే నాకు న‌చ్చ‌ని ప‌ని నేనెప్పుడూ చేయ‌ను. కానీ యాక్టింగ్ విష‌యంలో అలాంటి రోజు ఒక‌టి ఉండ‌ద‌ని నేను ప్ర‌గాఢంగా న‌మ్ముతాను. నా గురించి నాకు బాగా తెలుసు`` అని అన్నారు.

త‌న‌కిప్పుడు 43 ఏళ్ల‌ని, వ‌య‌సైపోయింద‌ని తానేం బాధ‌ప‌డ‌టం లేద‌ని అన్నారు. రోజురోజుకీ త‌న‌కు ఎన్నో విష‌యాల ప‌ట్ల ఉత్సాహం పెరుగుతోంద‌ని చెప్పారు. ``నేను ఇప్ప‌టికీ ట్రావెల్‌ని ఇష్ట‌ప‌డుతున్నాను. ఫ్రెండ్స్ తో ఔటింగ్‌కి వెళ్తున్నాను. ర‌క‌ర‌కాల డిషెస్ రుచి చూడాల‌ని అనుకుంటున్నాను. ప్ర‌తి విష‌యంలోనూ ప్యాష‌నేట్‌గానే ఉన్నాను. ఒక‌వేళ 83, 93లో రిటైర్ అవుతానేమో... మే బీ కాకుండానూ పోవ‌చ్చు`` అంటూ త‌న‌దైన స్టైల్‌లో చెప్పారు.
చిన్న‌త‌నంలో త‌న సోద‌రి క‌రిష్మా క‌పూర్‌తో క‌లిసి సెట్స్ కి వెళ్ల‌డం ఇంకా గుర్తుంద‌ని అన్నారు. స‌ల్మాన్ ఖాన్‌, షారుఖ్ ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌ని దూరం నుంచి చూసి ఫ్రెండ్స్ తో చెప్పుకున్న రోజులు ఇంకా గుర్తున్నాయ‌ని అన్నారు క‌రీనా క‌పూర్‌.