Read more!

English | Telugu

స‌ల్మాన్ - పూజా హెగ్డే డేటింగ్‌లో నిజ‌మెంత‌?

బాలీవుడ్ భాయీజాన్ స‌ల్మాన్‌ఖాన్ ఇప్పుడు ప్రేమ‌లో ఉన్నారా? త‌న 'కిసీ కా బాయ్ కిసీ కీ జాన్' కోస్టార్ పూజా హెగ్డేతో ల‌వ్‌లో ఉన్నారా? అనే టాక్ న‌డుస్తోంది బాలీవుడ్‌లో. ఈ సినిమా షూటింగ్ గురించి ప్ర‌స్తావిస్తూ బాలీవుడ్ న‌యా ల‌వ్ బ‌ర్డ్స్ ఇప్పుడు హ్యాపీగా షూటింగ్‌లో ఉన్నారంటూ ఆ మ‌ధ్య నెట్టింట్లో వైర‌ల్ అయిన న్యూస్ ఇప్పుడు మ‌ళ్లీ ట్రెండింగ్ లోకి వ‌చ్చేసింది.

రీసెంట్‌గా పూజా హెగ్డే బ్ర‌ద‌ర్ రిష‌బ్ పెళ్లి జ‌రిగింది. పూర్తిగా మంగుళూరియ‌న్స్ స్టైల్‌లో జ‌రిగిన ఈ వివాహ వేడుక‌కు స‌ల్మాన్ ఖాన్ హాజ‌ర‌య్యారు. పూర్తి బ్లాక్ డ్ర‌స్‌లో ప‌ర్ఫెక్ట్ స్టైల్‌లో క‌నిపించారు మిస్ట‌ర్ స‌ల్మాన్‌. ఆ ఫొటోలు  బాగా వైర‌ల్ అవుతున్నాయి.

పూజా హెగ్డేకి, స‌ల్మాన్‌కీ మ‌ధ్య కుచ్ కుచ్ హోతా హై అంటూ గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటున్నారు స‌ల్మాన్ స‌న్నిహితులు. అస‌లు గాసిప్స్ పుట్టించేవారికి కాస్త‌యినా బుద్ధీ, జ్ఞానం ఉండాలి. కూతురులాంటి వ‌య‌సున్న అమ్మాయితో లేనిపోని సంబంధాన్ని ఎందుకు అంట‌గ‌డుతున్నార‌ని అంటున్నారు. 

"సినిమా షూటింగ్‌లో భాగంగా ఇద్ద‌రూ ఫ్రెండ్లీగా ఉంటున్నారు. కోస్టార్స్ ని ఇళ్ల‌ల్లో శుభ‌కార్యాల‌కు పిల‌వ‌డంలో త‌ప్పేముంది? అయినా స‌ల్మాన్‌కి ఫ్యాన్స్ కానివారెవ‌రుంటారు? స‌ల్మాన్ అటెండ్ అవుతున్నారంటే, ఆ పెళ్లికి ఎంత క్రేజ్ ఉంటుందో తెలుసు క‌దా. అందుకే స‌డ‌న్ స‌ర్‌ప్రైజ్‌గా స‌ల్మాన్ వెళ్లారు. అంతేగానీ, వారిద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌న్న విష‌యంలో నిజం లేదు" అని అన్నారు.

స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌ల స్క్రీన్ మీద క‌నిపించిన సినిమా ప‌ఠాన్‌. షారుఖ్ కోసం ఈ సినిమాలో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు. త్వ‌ర‌లోనే ఆయ‌న న‌టించిన టైగ‌ర్‌3 విడుద‌ల‌కు రిలీజ్ అవుతోంది. స‌ల్మాన్‌, క‌త్రినా కైఫ్ క‌లిసి న‌టించిన టైగ‌ర్‌3లో షారుఖ్ కూడా గెస్ట్ గా క‌నిపిస్తారు. మ‌రోవైపు కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ఈద్‌కి విడుద‌ల కానుంది.