English | Telugu

'డ‌ర్టీ పిక్చ‌ర్‌'లో విద్యా బాల‌న్ కంటే నేను బాగా చేసుండేదాన్ని కాదు!

'డ‌ర్టీ పిక్చ‌ర్‌'లో విద్యా బాల‌న్ కంటే నేను బాగా చేసుండేదాన్ని కాదు!

 

సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'ద డ‌ర్టీ పిక్చ‌ర్‌'లో ఆమె పాత్ర‌ను పోషించిన విద్యా బాల‌న్ జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డును అందుకుంది. చాలా మందికి తెలీని విష‌యం.. ఆ క్యారెక్ట‌ర్‌కు ఫ‌స్ట్ చాయిస్ కంగ‌నా ర‌నౌత్‌. మిల‌న్ లూథ్రియా డైరెక్ష‌న్‌లో ఏక్తా క‌పూర్ నిర్మించ‌గా 2011లో విడుద‌లైన ఆ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ఒక ఇంట‌ర్వ్యూలో 'ద డ‌ర్టీ పిక్చ‌ర్' బ‌దులు 'త‌ను వెడ్స్ మ‌ను' మూవీని ఎంచుకున్నాన‌నీ, చాలామంది తాను చేసింది స్టుపిడ్ పనిగా చెప్పార‌నీ వెల్ల‌డించింది కంగ‌న‌. 'ద డ‌ర్టీ పిక్చ‌ర్‌'లో విద్యా బాల‌న్ టెర్రిఫిక్ ప‌ర్ఫార్మెన్స్ ఇచ్చింద‌ని ఆమె ప్ర‌శంసించింది.

"ఆ సినిమాను వ‌ద‌లుకున్నందుకు బాధ‌ప‌డుతున్నారా?" అన‌డిగితే, "నాట్ రియ‌ల్లీ. నేనెప్పుడూ చెప్పిన‌ట్లే, 'ద డ‌ర్టీ పిక్చ‌ర్' వండ‌ర్‌ఫుల్‌గా వ‌చ్చింది. కానీ విద్యా బాలన్ కంటే ఆ క్యారెక్ట‌ర్‌ను నేను బాగా చేసుండేదాన్ని కాదు, ఎందుకంటే ఆ క్యారెక్ట‌ర్‌ను ఆమె టెర్రిఫిక్‌గా చేసింది. ఆ సినిమా వ‌దులుకున్నందుకు ఇప్పుడు నేనేమీ బాధ‌ప‌డ‌ట్లేదు." అని తెలిపింది కంగ‌న‌.

అదివ‌ర‌కు ఆమె, "నేను 'ద డ‌ర్టీ పిక్చ‌ర్' బ‌దులు 'త‌ను వెడ్స్ మ‌ను' మూవీని ఎంచుకున్నాను. జ‌నం ఇప్ప‌టికీ 'ద డ‌ర్టీ పిక్చ‌ర్‌'ను వ‌దులుకోవ‌డం నేను చేసిన స్టుపిడ్ ప‌ని అంటూ ఉంటారు. కానీ నువ్వు కొంత కోల్పోతే, కొంత సాధిస్తావు కూడా. నా కెరీర్‌లో అనేక రిస్కులు చేశాను. బాలాజీ టెలీ ఫిలిమ్స్‌, మిల‌న్ లూథ్రియా లాంటి వాళ్లు ఓ వైపు ఉండ‌గా, నేను ఆనంద్ ఎల్‌. రాయ్ లాంటి కొత్త ద‌ర్శ‌కుడితో, లిమిటెడ్ బ‌డ్జెట్‌తో 'త‌ను వెడ్స్ మ‌ను' చేయ‌డానికే మొగ్గు చూపాను." అని చెప్పింది.

సంద‌ర్భ‌వ‌శాత్తూ 'త‌ను వెడ్స్ మ‌ను' కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది. దానికి సీక్వెల్ 'త‌ను వెడ్స్ మ‌ను 2' మ‌రింత హిట్ట‌వ‌డం గ‌మ‌నార్హం. ఈ రెండింటిలోనూ ఆమె స‌ర‌స‌న మాధ‌వ‌న్ న‌టించాడు.

'డ‌ర్టీ పిక్చ‌ర్‌'లో విద్యా బాల‌న్ కంటే నేను బాగా చేసుండేదాన్ని కాదు!