Read more!

English | Telugu

నేను కూడా పుష్ఫ గానే వస్తున్నా..రెడీగా ఉండండి

మీ అందరి కోసం పుష్ప గా వస్తున్నా.. నిజంగా  మీ అందరి కోసమే  పుష్పగా వస్తున్నాను. నాకు  మీ బ్లేసెస్ కావాలి   ఇప్పుడు ఈ మాటలని అంటుంది అల్లాటప్పా వ్యక్తి కాదు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టిన హ్యూమా ఖురేషి.  పైగా రజనీ కాంత్ తో కాలా కూడా చేసింది. ఇంతకీ తను ఏం చెప్తుందో చూద్దాం

జాలీ ఎల్ఎల్ బి.. 2013 లో బాలీవుడ్ లో వచ్చిన ఈ   కామెడీ అండ్ క్రైమ్ మూవీ  మంచి విజయాన్ని సాధించింది. క్రైమ్ అనే పేరు గాని ఎక్కువ భాగం కామెడీ నే ప్రధాన అంశంగా తెరకెక్కింది. ఆ తర్వాత  పార్ట్ 2 కూడా వచ్చింది. 2017 లో రాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా చేసాడు. ఆయన భార్య పుష్పా పాండే పాత్రలో  హ్యూమా ఖురేషి నవ్వులని పూయించింది. ఇప్పుడు జాలీ ఎల్ ఎల్ బి పార్ట్ 3 లో కూడా  ఖురేషి నటించబోతుంది. పైగా తన పుష్పా క్యారక్టర్ యధాతధంగా ఉండబోతుంది. ఈ విషయాన్ని తన ఇనిస్టా వేదికగా ఖురేషి నే  వెల్లడి చేసింది

ఇక  జాలీ ఎల్ ఎల్ బి పార్ట్ 3  షూటింగ్  ఇటీవలే  ప్రారంభం అయ్యింది. అక్షయ్ కుమార్ నే పార్ట్ 3 లో హీరోగా చేస్తున్నాడు   మున్నాభాయ్ ఎమ్ బి బి ఎస్ ఫేమ్ అర్షద్ వర్సి ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కోర్ట్ డ్రామా గా తెరకెక్కతున్న ఈ కథలో వాళ్ళిద్దరి అల్లరి ఈ మేర ఉంటుందో చూడాలి. సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాలీ ఎల్ ఎల్ బి  2  తెలుగులో కూడా రీమేక్ అయ్యింది. కామెడీ నటుడు సప్తగిరి హీరోగా సప్తగిరి ఎల్ ఎల్ బి గా వచ్చింది.