English | Telugu

టైమ్ ట్రావెల్ క‌థాంశంతో `క్రిష్ 4`

బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ ని సూప‌ర్ హీరోగా ప్రెజెంట్ చేసిన చిత్రం `క్రిష్` (2006). బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `కోయీ మిల్ గ‌యా` (2003)కి సీక్వెల్ గా రూపొందిన `క్రిష్`.. అంత‌కుమించి ఆద‌ర‌ణ పొందింది. అలాగే ఈ ఫ్రాంచైజీలో వ‌చ్చిన మూడో చిత్రం `క్రిష్ 3` (2013) కూడా నెగటివ్ టాక్ ని త‌ట్టుకుని మ‌రీ వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ సుదీర్ఘ విరామం అనంత‌రం ఈ సిరీస్ లో నాలుగో సినిమా రాబోతోంది. `క్రిష్ 4` పేరుతో రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని.. `క్రిష్` సిరీస్ లో గత మూడు సినిమాల‌ను తీర్చిదిద్దిన‌ అగ్ర ద‌ర్శ‌కుడు, హృతిక్ తండ్రి రాకేశ్ రోష‌న్ నే తెర‌కెక్కించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ భారీ బ‌డ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

ఇదిలా ఉంటే.. `క్రిష్ 4`కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. టైమ్ ట్రావెల్ క‌థాంశంతో ఈ సీక్వెల్ రూపొంద‌నుంద‌ట‌. అంతేకాదు.. `కోయీ మిల్ గ‌యా`, `క్రిష్` రెండింటిని ఒకే చోట చేర్చే క‌థ ఇద‌ని బాలీవుడ్ బ‌జ్. దీనికి తోడు, కొద్ది రోజుల క్రితం `క్రిష్` 15 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా ``గ‌తం అయిపోయింది. భ‌విష్య‌త్ ఏం తీసుకువ‌స్తుందో చూద్దాం`` అంటూ హృతిక్ చేసిన ట్వీట్ కూడా ఈ క‌థ‌నాల‌కు బ‌లం చేకూర్చుతోంది. మ‌రి.. టైమ్ ట్రావెల్ క‌థాంశంతో `క్రిష్ 4` బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.