Read more!

English | Telugu

సౌత్ లో హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. వేరే లెవెల్!

జనవరి 10న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తన 50వ పుట్టినరోజును జరుపుకున్నారు. హృతిక్ కి నార్త్ తో పాటు సౌత్ లోనూ ఎందరో అభిమానులున్న సంగతి తెలిసిందే. హృతిక్ 50వ పుట్టినరోజు సందర్బంగా ఆయన అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో తమ అభిమాన హీరో బర్త్ డే సెలబ్రెషన్స్ ను గ్రాండ్ గా చేశారు. 

హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి సిటీలలో కేక్ కట్ చేయడమే కాకుండా.. కొంతమంది ఫాన్స్ హృతిక్ రోషన్ హిట్ సాంగ్స్ కు డాన్స్ చేశారు. అలాగే పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా అభిమానులు హైదరాబాద్, విజయవాడ మరియు వైజాగ్ లో ఉన్న కొన్ని అనాథాశ్రమాలలో ఫుడ్ డొనేట్ చేశారు. అలాగే మంగళగిరి, వైజాగ్ లో మొక్కలు నాటారు. చెన్నై సిటీలో ట్రక్ లో ఫుడ్ ను డిస్ట్రిబ్యూషన్ చేశారు. తమ అభిమాన హీరో నటించిన సినిమా 'ఫైటర్' జనవరి 25న విడుదల అవుతున్న సందర్బంగా సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని హృతిక్ ఫాన్స్ కోరుకున్నారు.