Read more!

English | Telugu

'హీర్ ఆస్మాని' సాంగ్ తో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న హృతిక్!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'ఫైటర్'(Fighter). 'వార్', 'పఠాన్' సినిమాల‌ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వ‌హిస్తున్న చిత్రం రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న గ్రాండ్ గా  ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ తో పాటు రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'హీర్ ఆస్మాని' సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక సాంగ్ లో ఎయిర్ ఫోర్స్ పైలెట్ లుక్ లో హృతిక్ లుక్, ఫిజిక్ వావ్ అనిపించేలా ఉన్నాయని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

'ఫైటర్' సినిమాను వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా క‌నిపించ‌నుండ‌గా.. స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా దీపికా పదుకొనే కనిపించనుంది. గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్‌ కపూర్‌ సందడి చేయనున్నాడు. అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.