English | Telugu

హాట్‌హిట్‌.. రోజూ ల‌క్ష‌ల్లో శిల్పాశెట్టి భ‌ర్త‌ సంపాదించిన ఓటీటీ అశ్లీల చిత్రాల యాప్‌!

శిల్పాశెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా బ్యాంక్ అకౌంట్‌కు రెగ్యుల‌ర్‌గా హాట్‌హిట్ అనే మొబైల్ యాప్ నుంచి డ‌బ్బులు జ‌మ అవుతూ వ‌చ్చాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ముంబై పోలీసులు ఛేదించిన అశ్లీల చిత్రాల రాకెట్‌లో వెలుగులోకి వ‌చ్చిన యాప్ అది. అప్ప‌టిదాకా గూగుల్ ప్లేస్టోర్‌లో హాట్‌హిట్ మూవీస్ యాప్ అందుబాటులో ఉంది. "బెస్ట్ ఇండియ‌న్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్‌. మీ అన్వేష‌ణ హాట్‌హిట్ మూవీస్ అండ్ ఒరిజిన‌ల్స్‌తో ముగుస్తుంది." అని ఆ యాప్ త‌న‌ను తాను అభివ‌ర్ణించుకుంటుంది. దానిలో ర‌క‌ర‌కాల స‌బ్‌స్క్రిప్ష‌న్స్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు.. 28 రోజులుకు ఫుల్ హెచ్‌డి ప్రీమియం రూ. 199, లేదా 45 రోజుల ఫుట్ హెచ్‌డి సినిమాటిక్ రూ. 249.

ఫిబ్ర‌వ‌రిలో పోలీసులు ఈ పోర్న్ రాకెట్‌ను ప‌ట్టుకునే స‌మ‌యానికి ఫిబ్ర‌వ‌రి 3న హాట్‌హిట్ నుంచి రాజ్ కుంద్రా అకౌంట్‌కు రూ. 2.7 ల‌క్ష‌లు వ‌చ్చాయి. అదేవిధంగా జ‌న‌వ‌రి 10న రూ. 3 ల‌క్ష‌లు, జ‌న‌వ‌రి 13న రూ. 2 ల‌క్ష‌లు, జ‌న‌వ‌రి 20న రూ. 1 ల‌క్ష‌, జ‌న‌వ‌రి 23న రూ. 95 వేలు అత‌ను అందుకున్నాడు.

రాజ్ కుంద్రా, అత‌ని బావ‌ ప్ర‌దీప్ బ‌క్షికి చెందిన రెండు కంపెనీలు క‌లిసి హాట్‌షాట్స్ డిజిట‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే మొబైల్ యాప్‌ను స్టార్ట్ చేశాయి. దీన్ని కెన్రిన్ లిమిటెడ్ డెవ‌ల‌ప్ చేసింద‌ని ముంబై జాయింట్ పోలీస్ క‌మిష‌న‌ర్ (క్రైమ్‌) మిళింద్ భ‌రంబే చెప్పారు. హాట్‌షాట్స్ అనే పేరుతో ర‌న్ అయిన ఆ యాప్ వివాదానికి కేంద్ర‌బిందువుగా మారింది. దాని ద్వారా అశ్లీల చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేశార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఈ యాప్‌పై ప‌లు ఫిర్యాదులు రావ‌డంతో దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌, యాపిల్ యాప్ స్టోర్ తొలిగించేశాయి. అయిన‌ప్ప‌టికీ ప‌లు వెబ్‌సైట్ల‌లో ఈ యాప్‌కు చెందిన ఆండ్రాయిడ్ అప్లికేష‌న్ ప్యాకేజ్ (ఏపీకే) అందుబాటులో ఉంది.