English | Telugu
శృంగారం, షారూఖ్... ఇండియాలో ఈ రెండే ఎక్కువ సేల్ అవుతాయి!
Updated : Oct 18, 2023
తెలుగు ప్రేక్షకులతో మీకు రాజ్ కుంద్రా తెలుసా అని అడిగితే రాజ్ కుంద్రా ఎవరు మాకు తెలియదే అని అంటారు. కానీ ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తెలుసా అంటే తెలుసు అని అంటారు. ఇన్నాళ్లు వ్యాపారవేత్త గానే ప్రపంచానికి తెలిసిన కుంద్రా తొలిసారి హీరో గా నటించాడు. ఆ సినిమా కి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఫంక్షన్ లో కొన్ని సంచలన కామెంట్స్ చేసి బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు.
రాజ్ కుంద్రా కొన్ని సంవత్సరాల క్రితం పోర్న్ కేసు లో కొన్ని నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిలుపై బయటకి వచ్చాడు. రాజ్ చాలా రోజులు తన ముఖాన్ని ఎవరికీ చూపించలేదు. ఇప్పుడు రాజ్ కుంద్రా హీరో గా బాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు.ఆయన హీరో గా తెరకెక్కుతున్న యుటి 69 మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మీడియా తో మాట్లాడిన రాజ్ తన జీవితంలో చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించానని తన జీవితంలో మలి భాగం చాలా దారుణం గా ఉందని కంట తడి కూడా పెట్టాడు. ఆ తర్వాత ఇండియా లో రెండే రెండు వస్తువులు ఎక్కువగా అమ్ముడవుతాయని అందులో ఒకటి శృంగారం అయితే రెండోది షారుఖ్ ఖాన్ అని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. కాగా రాజ్ కుంద్రా తన జీవితంలో ఇప్పటి వరకు ఎదురుకున్న సంఘటనల ఆధారంగా యుటి 69 మూవీ తెరకెక్కుతుంది. నవంబర్ 3 న ఆ సినిమా విడుదల కాబోతుంది.