English | Telugu

క‌త్రినా-విక్కీ పెళ్లి.. అతిథులు బ‌స‌చేసే ఒక్కో టెంట్ అద్దె ఒక్క రాత్రికి 70 వేల పైమాటే!

క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ త‌మ వివాహాన్ని గోప్యంగా ఉంచేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ జంట రాజ‌స్థాన్‌లోని స‌వాల్ మాధోపూర్‌లో ఉన్న సిక్స్ సెన్సెస్ బ‌ర్వారా ఫోర్ట్‌లో డిసెంబ‌ర్ 9న పెళ్లి చేసుకుంటున్నారు. క‌త్రినా-విక్కీ త‌మ వివాహానికి వ‌చ్చే అతిథుల కోసం విలాస‌వంత‌మైన రిసార్ట్‌లో ఏర్పాట్లు చేశారు. ఆ అతిథులు విడిది చేసే ఒక్కో టెంట్‌ క‌నీస ధ‌ర ఒక రాత్రికి రూ. 70 వేల పైమాటే.

వీవీఐపీ గెస్టుల కోసం వెడ్డింగ్ ప్లాన‌ర్స్ 8 నుంచి 10 టెంట్ల‌ను బుక్ చేశార‌ని స‌మాచారం. ఒక్కో రాత్రికి ఈ టెంట్ల అద్దె రూ. 70 వేల నుంచి మొద‌ల‌వుతుంది. ఈ టెంట్ల‌లో బ‌స‌చేసే గెస్ట్‌ల పేర్లు, వాటికి సంబంధించిన కోడ్స్ క‌త్రినా, విక్కీ, వారి వెడ్డింగ్ ప్లాన‌ర్స్‌కి మాత్ర‌మే తెలుసు. హోట‌ల్ సిబ్బందికి నంబ‌ర్ మాత్ర‌మే ఇచ్చారు. హోట‌ల్ నుంచి గెస్ట్‌లు బ‌య‌ట‌కు వ‌చ్చే తేదీ డిసెంబ‌ర్ 10.

Also read:క‌త్రినా-విక్కీ పెళ్లి కోసం రాజ‌స్థాన్‌లో బుక్క‌యిన 45 హోట‌ళ్లు!

త‌మ వివాహ వేడుక‌కు వ‌చ్చే వారి కోసం వ‌ధూవ‌రులు అనేక నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. పెళ్లికి ఎవ‌రెవ‌రు వ‌చ్చార‌నేది వెల్ల‌డించ‌కూడ‌దు, ఫొటోలు తీయ‌కూడ‌దు, సోష‌ల్ మీడియాలో ఫొటోలు షేర్ చేయ‌కూడ‌దు, సోష‌ల్ మీడియాలో లొకేష‌న్‌ను షేర్ చేయ‌కూడ‌దు, వేదిక నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ బ‌య‌టి ప్ర‌పంచంతో సంబంధం పెట్టుకోకూడ‌దు, రీల్స్ కానీ, వీడియోస్ కానీ తియ్య‌కూడ‌దు అనే నిబంధ‌న‌లు వాటిలో ఉన్నాయి. వెడ్డింగ్ ప్లాన‌ర్స్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఫొటోలు మాత్ర‌మే మీడియాకు అంద‌జేయ‌బ‌డ‌తాయి.

Also read:య‌శ్‌ను క్ష‌మించ‌మ‌ని కోరిన ఆమిర్‌.. రీజ‌న్ ఏంటో తెలుసా?

క‌త్రినా-విక్కీ పెళ్లికి వ‌రుణ్ ధావ‌న్‌, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, క‌ర‌ణ్ జోహార్‌, రోహిత్ శెట్టి, అలీ అబ్బాస్ జాఫ‌ర్ లాంటి సెల‌బ్రిటీలు అటెండ్ అవుతున్నారు. విక్కీ త‌మ్ముడు స‌న్నీ కౌశ‌ల్ పెళ్లి ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నాడు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.