English | Telugu

విదేశాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న తొలి బాలీవుడ్ సినిమా గురించి తెలుసా?


ఈ వారం బాలీవుడ్‌లో హిట్ సౌండ్ మామూలుగా లేదు. మ‌న స‌త్తా చూపించిన వార‌మిది అంటూ గ‌ర్వప‌డుతోంది బాలీవుడ్‌. గ‌దార్‌2, ప‌ఠాన్‌, రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ క‌హానీ, జ‌ర హ‌ట్కే జ‌ర బ‌చ్కే అంటూ సూప‌ర్‌డూప‌ర్ హిట్స్ వ‌చ్చేశాయి ఈ ఏడాది.బాలీవుడ్ అంత ఆనందంగా ఉన్న ఈ టైమ్‌లో అస‌లు ఫారిన్ లొకేష‌న్ల‌లో షూటింగ్ జ‌రుపుకున్న బాలీవుడ్ సినిమా ఏంటి? అనే విష‌యం మీద డీప్ డిస్క‌ష‌న్ జ‌రుగుతోంది. 1960లో విడుద‌లైన సంగం మూవీ కోసం తొలిసారి ఫారిన్ లొకేష‌న్ల‌లో షూటింగ్ చేశార‌ట‌.
రాజ్‌క‌పూర్ త‌న న‌టీన‌టుల‌ను అంద‌రినీ వెంట‌పెట్టుకుని యూరోప్‌లో తొలిసారి షూటింగ్ చేశార‌ట‌. ముగ్గురు స్నేహితుల క‌థ‌ను చెప్పిన సినిమా సంగం. అప్ప‌ట్లో చాలా ఖ‌ర్చుపెట్టి తెర‌కెక్కించారు. చాలా ఎమోష‌న‌ల్‌గా సాగే రొమాంటిక్ డ్రామా అది.

రాజ్‌క‌పూర్ ఇందులో సుంద‌ర్ అనే కేర‌క్ట‌ర్ చేశారు. గోపాల్ అనే కేర‌క్ట‌ర్‌లో రాజేంద్ర‌కుమార్ న‌టించారు. వైజ‌యంతిమాల ఇందులో రాధ పాత్ర చేశారు. ప్యారిస్‌, స్విట్జ‌ర్లాండ్‌, వెనిస్‌లో ఈ సినిమాలోని హ‌నీమూన్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. క్లాసిక్ మాన్యుమెంట్స్ ని ఈ చిత్రంలో చూడొచ్చు. ఈఫిల్ ట‌వ‌ర్‌లో చూపించిన తొలి బాలీవుడ్ సినిమా ఇదే.ఆ ద‌శాబ్దంలో అతి పెద్ద హిట్‌గా సంగం సినిమా గురించి చెబుతారు. రాజ్‌క‌పూర్‌కి న‌టుడిగా కూడా పెద్ద హిట్ అయిన సినిమా ఇది. ప‌లు అవార్డుల‌ను కూడా ద‌క్కించుకుంది.సంగం క‌న్నా ముందే 1940లో హీరేంద్ర‌కుమార్బ‌సు ఆఫ్రీకా మే హింద్‌ని తెర‌కెక్కించారు. దాన్నంతా ఆఫ్రికాలో తెర‌కెక్కించారు. కానీ అది మెయిన్‌స్ట్రీమ్ సినిమా కాదు. అందుకే ఫారిన్ లొకేష‌న్ల‌లో షూటింగ్ జ‌రుపుకున్నప్రాప‌ర్ బిగ్ బ‌డ్జెట్ బాలీవుడ్ సినిమాగా సంగం చరిత్రంలో నిలిచిపోయింది.