English | Telugu

హృతిక్ రోషన్ మీద తెలుగు ప్రేక్షకుల అలక 

బాలీవుడ్ లో ఉన్న ఖాన్స్ హీరోలని కపూర్ హీరోలని తట్టుకొని నెంబర్ వన్ రేసులో ముందుండే హీరో ఎవరని టక్కున ప్రశ్న వేస్తే అందరు కూడా హృతిక్ రోషన్ అని సమాధానం చెప్తారు .తన హై పవర్ యాక్టింగ్ తో మెరుపులాంటి డాన్సుతో ఎంతో అంది అభిమానులని ఆయన సంపాదించారు.లేటెస్ట్ గా హృతిక్ నుంచి వస్తున్న చిత్రం ఫైటర్. భారత దేశ వ్యాఫంగా ఉన్న హృతిక్ అభిమానులతో పాటు సినీ అభిమానులందరు కూడా ఫైటర్ఎం కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ మూవీ గురించి వస్తున్న తాజగా వార్తలు హృతిక్ అభిమానులని తీవ్ర నిరాశకి గురి చేస్తుంది.

కొన్ని సంవత్సరాల క్రితం హృతిక్ నటించిన క్రిష్ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. తెలుగులో కూడా డబ్ అయ్యి అసలైన పాన్ ఇండియా సినిమాగా కూడా ఆ మూవీ నిలిచింది. పైగా ఆ మూవీలోని క్రిష్ నటనకి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు క్రిష్ అభిమానులుగా మారారు. అప్పటినుంచి హృతిక్ నటిస్తున్న ప్రతి సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు.లేటెస్ట్ గా కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్ మూవీ సిరీస్ కూడా తెలుగులో అఖండ విజయాన్ని సాధించింది. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ హృతిక్ తాజా చిత్రం ఫైటర్ తెలుగులో విడుదల కావటం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఆ మూవీ రిలీజ్ అవ్వటం లేదు. అంటే ఫైటర్ మూవీ పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవ్వటం లేదు. ఈ వార్తలతో తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఉన్న హృతిక్ అభిమానులందరు డీలా పడ్డారు.

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ఒకటే అన్నట్టుగా ఒక భాషకి చెందిన సినిమాలు మరో భాషకి రిలీజ్ అవుతున్నాయి. ఒక మాదిరి హీరోలే తమ సినిమాలని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తుంటే హృతిక్ లాంటి సూపర్ స్టార్ ఇలాంటి స్టెప్ తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. జనవరి 25 న విడుదల అవుతున్న ఫైటర్ మూవీ అప్పటికి తన నిర్ణయాన్ని మార్చుకొని పాన్ ఇండియా లెవెల్లో నే ప్రేక్షకుల ముందుకి వస్తుందేమో చూడాలి. హీట్ చిత్రాల దర్శకుడు సిద్దార్ధ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.