English | Telugu
బాలీవుడ్ తారలతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎఫైర్స్!
Updated : May 24, 2021
ఇండియన్ క్రికెట్‌ను సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ రూల్ చేస్తున్న కాలంలో పాకిస్తాన్ టీమ్ కెప్టెన్‌గా ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ క్రికెట్‌ను శాసించాడు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. మంచి అందగాడు కూడా కావడంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా ఆ దేశాన్ని పాలించే స్థాయికి చేరుకున్నాడు.
క్రికెట్ ఆడే కాలంలో ఆయన ఫీల్డ్‌లో ఆల్‌రౌండర్‌గా ఎలా చెలరేగిపోయేవాడో, ఫీల్డ్ బయట తన ప్లేబాయ్ ప్రవర్తనలో అలా వార్తల్లో నలుగుతుండేవాడు ఇమ్రాన్. ఆయన క్రికెట్ ఆడుతుంటే కేవలం ఆయనను చూడ్డం కోసమే అభిమానులు టీవీ సెట్లకు అతుక్కుపోయేవారు. వారిలో అమ్మాయిలు అధిక సంఖ్యలో ఉండేవారు. ఆ కాలంలో పలువురు బాలీవుడ్ తారలతో ఆయన డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. అలా ఆయనతో కలిసి వినిపించిన బాలీవుడ్ తారలెవరంటే...
1. రేఖతో ఇమ్రాన్ లవ్ ఎఫైర్
డెబ్భై, ఎనభైలలో బాలీవుడ్‌లోని అత్యంత ఫేమస్ హీరోయిన్లలో రేఖ ఒకరు. ముంబైకి ఇమ్రాన్ ఖాన్ వచ్చినప్పుడల్లా, ఆయనా, రేఖ కలిసి చెట్టాపట్టాలేసుకుని పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ వచ్చారు. ఆ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనీ, ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.
2. జీనత్ అమన్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఇమ్రాన్
బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ యాక్ట్రెస్‌లలో ఒకరైన జీనత్ అమన్‌తో ఇమ్రాన్ ప్రేమలో పడ్డాడనే ప్రచారం ఉంది. 1979 నవంబర్‌లో పాకిస్తాన్ టీమ్ ఇండియాకు వచ్చినప్పుడు, ఇమ్రాన్‌ను మొట్టమొదటగా "ప్లేబాయ్" అంటూ పత్రికలు రాశాయి. అప్పుడు బెంగళూరులోని క్రికెట్ స్టేడియంలో ఉన్న డ్రస్సింగ్ రూమ్‌లో తన టీమ్‌మేట్స్‌తో కలిసి 27వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు ఇమ్రాన్. కానీ కొన్ని వార్తాపత్రికలు ఆయన తన బర్త్‌డేని జీనత్ అమన్‌తో కలిసి జరుపుకున్నాడంటూ రాశాయి. అయితే తమ అనుబంధంపై ఆ ఇద్దరిలో ఎవరూ నోరెత్తలేదు.
3. షబానా అజ్మీ, ఇమ్రాన్ బంధం
అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ షబానా అజ్మీతో ఇమ్రాన్ పేరు కలిసి వినిపించింది కానీ ఆ ఇద్దరూ తమ అనుబంధం గురించి పబ్లిగ్గా ఎప్పుడూ చెప్పలేదు.
4. మూన్ మూన్ సేన్‌తో ఇమ్రాన్ ప్రేమాయణం
బెంగాలీ తార, 'సిరివెన్నెల'తో తెలుగువారికి చేరువైన మూన్ మూన్ సేన్‌తో ఇమ్రాన్ సన్నిహితంగా మెలగడం ఆ రోజుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. మూన్ మూన్ అందానికి ఇమ్రాన్ దాసోహమయ్యాడని చెప్పుకొనేవారు.
ఆ కాలంలో పలువురు బాలీవుడ్ తారలు ఇమ్రాన్ ఖాన్ అంటే పిచ్చి వ్యామోహం చూపించేవారంటారు. ఆయన ఎఫైర్లు ఇప్పటికీ ఫేమస్సే.