English | Telugu
పుష్పని ఇమిటేట్ చేయలేదన్న దుల్కర్
Updated : Aug 19, 2023
దుల్కర్ సల్మాన్ పుష్ప గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పుష్ప. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. ఫాహద్ ఫాజిల్ విలన్‌గా చేశారు. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కి విపరీతమైన స్పందన వచ్చింది. సెకండ్ పార్ట్ ఇప్పుడు షూటింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్ పుష్ప గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా కింగ్ ఆఫ్ కోత. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. అక్కడ దుల్కర్‌కి ఓ ప్రశ్న ఎదురైంది. కింగ్ ఆఫ్ కోతని చూస్తుంటే పుష్ప గుర్తుకొస్తోంది. మీరేమంటారు అని అడిగారు.దానికి సమాధానం చెప్పిన దుల్కర్, ``దాన్ని కాంప్లిమెంట్‌గా తీసుకుంటాను. అయితే పుష్ప సినిమాను ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించలేదు`` అని ఆన్సర్ చెప్పారు.
దుల్కర్ మాట్లాడుతూ ``నాకు బన్నీ అంటే చాలా ఇష్టం. నటుడిగా, పెర్ఫార్మర్‌గా ఆయన్ని ఇష్టపడతాను. అయితే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని కింగ్ ఆఫ్ కోత చేయలేదు. ఈ సినిమాకు మూడేళ్లకు ముందే స్కెచ్‌లు వేశారు. అప్పటి నుంచి ప్లాన్ మా మనసుల్లో ఉంది. అయినా పుష్ప గుర్తుకొస్తోందంటే, నేను దాన్ని కాంప్లిమెంట్‌గానే తీసుకుంటాను. పుష్ప కి వచ్చినంత సక్సెస్ మా సినిమాకు కూడా రావాలి`` అని అన్నారు.
అభిలాష్ జోషీ దర్శకత్వం వహించారు కింగ్ ఆఫ్ కోతా మూవీని. ఐశ్వర్య లక్ష్మి, షబీర్ కల్లరక్కల్, ప్రసన్న, నైలా ఉషా, గోకుల్ సురేష్ కీలక పాత్రల్లో నటించారు. ఓనమ్ సందర్భంగా విడుదల కానుంది ఈ సినిమా.