English | Telugu
దుల్కర్ ఇన్నాళ్లూ దాచిపెట్టింది ఇదేనా!
Updated : Jul 21, 2023
తాను ఇన్నాళ్లూ దాచిపెట్టింది ఇదే అంటూ మాలీవుడ్ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ పోస్టు పెట్టారు. అందులో తన హిందీ మ్యూజిక్ వీడియో గురించి ఓ విషయాన్ని ప్రస్తావించారు. దుల్కర్ సల్మాన్ మన దగ్గర సౌత్‌లో ఎంత పాపులరో, నార్త్ లోనూ అంతే గొప్ప గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ మలయాళ నటుడికి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. లేటెస్ట్ గా ఆయన సింగర్ జస్లీన్ రాయల్‌తో కలిసి హీరియే అనే మ్యూజిక్ వీడియోలో యాక్ట్ చేశారు. ఈ మ్యూజిక్ వీడియో జస్లీన్, అర్జిత్ సింగ్ కలిసి పెర్ఫార్మ్ చేసింది. ఈ మ్యూజిక్ వీడియో దుల్కర్ ఫస్ట్ మ్యూజిక్ ప్రాజెక్ట్ గా రికార్డులోకెక్కింది. ఈ సాంగ్‌ని జస్లీన్ రాయల్ నిర్మించారు. వార్నర్ మ్యూజిక్ ఇండియా సమర్పిస్తోంది. అర్జిత్ సింగ కంపోజ్ చేసి, పాడారు. ఈ నెల 25న విడుదల కానుంది ఈ మ్యూజిక్ వీడియో. అన్నీ స్ట్రీమింగ్ ప్లాట్‌పార్మ్స్ లోనూ అందుబాటులోకి రానుంది. ఈవీడియోలో మోస్ట్ రొమాంటిక్‌గా కనిపించనున్నారు దుల్కర్ సల్మాన్.
``హీరియే నాకు చాలా స్పెషల్ సాంగ్. ట్యూన్ వినగానే నాకు నచ్చేసింది. పాటతో ప్రేమలో పడిపోయాను. కాన్సెప్ట్ కూడా చాలా బావుంది. సింగర్స్ ఇద్దరూ అదరగొట్టేశారు. ఇంత మంచి ప్రేమ పాటతో అసోసియేట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ ఈ వీడియో చూసి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఉంది`` అని అన్నారు. దుల్కర్ సల్మాన్ ప్యాన్ ఇండియన్ సినిమా, కింగ్ ఆఫ్ కోతాలో నటిస్తున్నారు. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేస్తారు. ఇటీవల టీజర్ విడుదలైంది.