Read more!

English | Telugu

ఒకే ద‌ర్శ‌కుడితో దీపిక బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్!

పెళ్ళ‌య్యాక కూడా హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన హ‌వా సాగిస్తోంది బాలీవుడ్ దివా దీపికా ప‌దుకోణ్. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఆ సినిమాలే.. `ప‌ఠాన్`, `ఫైట‌ర్`, `స‌ర్క‌స్`, `ప్రాజెక్ట్ కె`. వీటిలో `స‌ర్క‌స్` కోసం అతిథి పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న దీపిక‌.. మిగిలిన మూడు సినిమాల్లోనూ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తోంది.

ఇదిలా ఉంటే, 2023 రిప‌బ్లిక్ డేని టార్గెట్ చేసుకుని దీపిక నాయిక‌గా న‌టిస్తున్న‌ రెండు హిందీ చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఆ చిత్రాలే.. `ప‌ఠాన్`, `ఫైట‌ర్`. త‌న ఫ‌స్ట్ బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తో క‌లిసి దీపిక న‌టిస్తున్న `ప‌ఠాన్` 2023 జ‌న‌వ‌రి 25న విడుద‌ల కానుండ‌గా.. హ్యాండ్స‌మ్ హంక్ హృతిక్ రోష‌న్ కి జోడీగా తొలిసారిగా సంద‌డి చేస్తున్న `ఫైట‌ర్` 2023 జ‌న‌వ‌రి 26న తెర‌పైకి రాబోతోంది. ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల‌ను కూడా `వార్` కెప్టెన్ సిద్ధార్ధ్ ఆనంద్ రూపొందిస్తున్నారు. మ‌రి.. వ‌రుస రోజుల్లో రాబోతున్న ఈ బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ తో దీపిక‌, సిద్ధార్ధ్ ఎలాంటి ఫ‌లితాల‌ను అందుకుంటారో చూడాలి.

కాగా, ఇదివ‌ర‌కు దీపిక‌, సిద్ధార్ధ్ క‌లిసి ప‌నిచేసిన `బ‌చ్నా యే హ‌సీనో` (2008) బాక్సాఫీస్ ముంగిట మంచి విజ‌యాన్ని సాధించింది. 14 ఏళ్ళ త‌రువాత మ‌ళ్ళీ ఈ ఇద్ద‌రు `ప‌ఠాన్`, `ఫైట‌ర్` కోసం వెంట‌వెంట‌నే జ‌ట్టుక‌ట్టారు.