Read more!

English | Telugu

డెబ్యూ పెయిర్‌: స‌న్నీ డియోల్ కొడుకు.. స‌ల్మాన్ ఖాన్ మేన‌కోడ‌లు!

 

ప్ర‌తి ఏటా ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి ఫ్రెష్ ఫేసులు అనేకం ప‌రిచ‌య‌మ‌వుతూనే ఉంటున్నాయి. కొత్త‌వారిలో అనేక‌మంది త్వ‌ర‌లోనే ఫేడ‌వుట్ అయిపోతే, కొంత‌మంది త‌మ ముద్ర‌ను వేస్తూ భ‌విష్య‌త్ సూప‌ర్‌స్టార్లుగా వెలుగొందుతుంటారు. లేటెస్ట్‌గా ఒక డెబ్యూ పెయిర్ వార్త‌ల్లో నిలుస్తోంది. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్ మేన‌కోడ‌లు అలిజే అగ్నిహోత్రి హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతోంది. 

బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫ్యామిలీ మూవీస్ డైరెక్ట‌ర్ సూర‌జ్ బ‌ర్జాత్యా కొడుకు అవినాశ్ డైరెక్ట్ చేయ‌బోతున్న ఫ‌స్ట్ మూవీలో అలిజే హీరోయిన్‌గా ఎంపికైంద‌ని స‌మాచారం. ఇక ఆమెకు జోడీగా న‌టించ‌బోతోంది ఎవ‌రో తెలుసా?  కండ‌ల వీరుడు స‌న్నీ డియోల్ చిన్న‌కొడుకు రాజ్‌వీర్‌! అత‌నికీ ఇది ఫ‌స్ట్ ఫిల్మే!

ర‌ణ‌బీర్ క‌పూర్‌, దీపికా ప‌డుకోనే జంట‌గా న‌టించ‌గా హిట్ట‌యిన 'యే జ‌వానీ హై దీవానీ' మూవీ త‌ర‌హాలో రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా రూపొందుతుంద‌ని వినికిడి. స‌ల్మాన్ చెల్లెలు అల్విరా ఖాన్‌, న‌టుడు-ద‌ర్శ‌కుడు అతుల్ అగ్నిహోత్రి ముద్దుల త‌న‌య అలిజే. ఇదివ‌ర‌కు స‌ల్మాన్ 'ద‌బాంగ్ 3' మూవీతో అలిజే ప‌రిచ‌య‌మ‌వుతుంద‌ని వినిపించింది. అయితే ఇప్పుడు అవినాశ్ బ‌ర్జాత్యా డెబ్యూ డైరెక్టోరియ‌ల్ ద్వారానే ఆమె ఇంట్ర‌డ్యూస్ అవుతుంద‌ని చెప్తున్నారు. అలిజే వ‌య‌సు 20 సంవ‌త్స‌రాలు కాగా, రాజ్‌వీర్ వ‌య‌సు 24 సంవ‌త్స‌రాలు.