Read more!

English | Telugu

లవ్ టుడే తో సంబంధం లేదంటున్న బోనీకపూర్!

గత ఏడాది కన్నడలో కే జి ఎఫ్ 2, కాంతారా చిత్రాలు సంచలనం సృష్టించాయి. మరోవైపు తమిళం నుంచి తెలుగులోకి డ‌బ్ అయిన  కమలహాసన్ -లోకేష్ కనకరాజుల విక్ర‌మ్,  ప్రదీప్ రంగనాథన్ తానే దర్శకుడిగా హీరోగా నటించిన లవ్ టుడే చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక బోనీకపూర్ స్టార్ ప్రొడ్యూసర్ గా అటు హిందీలో కాకుండా తమిళ్‌లో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన అజిత్ తో తునివు  అనే సినిమా తెరకెక్కించారు. తాజాగా సంక్రాంతి కానుకగా విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాట యావ‌రేజ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో స్టార్ హీరో త‌ల అజిత్ ఎలివేష‌న్ సీన్స్‌, యాక్ష‌న్ సీక్వెన్స్‌లో మ‌రీ అతిగా ఉన్నాయ‌ని స్వ‌యంగా అజిత్ అభిమానులే అంటున్నారు. ఈ చిత్రం తెలుగులోకి కూడా తెగింపుగా డ‌బ్బింగ్ అయింది. ఇందులో అజిత్ ని చూపించిన విధానం త‌మిళ‌తంబీల‌కు ఫ‌ర్వాలేద‌నిపిస్తున్న‌ప్ప‌టికీ తెలుగు వారికి మాత్రం రుచించ‌డం లేదు. మ‌రీ ఇంత ఓవ‌రా? అని పెదవి విరుస్తున్నారు. దాంతో ఈ మూవీ తెలుగు డబ్బింగ్ బిలో యావ‌రేజ్ గా మిగ‌ల‌డం త‌ప్పద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

కాగా ల‌వ్ టు డే  బాలీవుడ్ రీమేక్ హక్కులను బోనీక‌పూర్ సొంతం చేసుకున్నాడ‌నే  వార్తలు హల్చల్ చేస్తున్నాయి.  అయితే ఈ వార్తలపై బోనీకపూర్ తాజాగా స్పందించారు.  తన సోషల్ మీడియాలో లవ్ టుడే రైట్స్ నా వద్ద లేవు. నేను ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు అని ఆయన స్వయంగా రెస్పాండ్ అయ్యారు. కానీ ఇప్ప‌టికీ బోనీక‌పూరే  హిందీలో రీమేక్ చేస్తాడని కోలీవుడ్ మీడియా అంటుంది. దానికి బోనీకపూర్  ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. దాంతో ఈ  సినిమాని హిందీలో బోనీ కపూర్ చేయడం లేదని క్లారిటీ వ‌చ్చింది. మరోవైపు ల‌వ్ టు డేను వరుణ్ ధావన్ హీరోగా త‌న  తండ్రి డేవిడ్ ధావన్ తో కలిసి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

డేవిడ్ ధావన్ కనుక దర్శకత్వానికి ఒప్పుకోకపోతే తమిళంలో దర్శకత్వం వహించిన ప్ర‌దీప్ రంగ‌నాథ‌నే  బాలీవుడ్ లో కూడా డైరెక్ట్ చేస్తాడ‌నే చర్చ కూడా సాగుతోంది. అయినా కొడుకు వరుణ్ దావని అడిగితే  లవ్ టు డే ను డేవిడ్ ధావ‌న్ ఖ‌చ్చితంగా రీమేక్ చేస్తాడ‌ని స‌మాచారం. కాబట్టి డేవిడ్ దావత్ దర్శకత్వంలోనే లవ్ టు డే రీమేక్ రూపొందే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి వాటిల్లో నిజమెంతో చూడాలి....?