English | Telugu

42 ఏళ్ళ వయసులో కత్రినా కైఫ్‌ సాహసం.. షాక్‌ అవుతున్న బాలీవుడ్‌!

2004లో వెంకటేష్‌ హీరోగా వచ్చిన ‘మల్లీశ్వరి’ చిత్రంతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన కత్రినా కైఫ్‌.. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో కలిసి ‘అల్లరి పిడుగు’ చిత్రంలో నటించారు. ఆ క్రమంలోనే మలయాళంలో కూడా ఒక సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా బిజీ అయిపోవడంతో సౌత్‌ వైపు కన్నెత్తి చూడలేదు. హిందీలో చాలా సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది కత్రినా. అంతేకాదు, అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌గా కూడా పేరు తెచ్చుకుంది. నాలుగేళ్ళ క్రితం అంటే 2021 డిసెంబర్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్నారు. వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరిగింది. రాజస్థాన్‌లోని సవాయ్‌ మాధోపూర్‌లోని ఫోర్ట్‌ బర్వారాలో ఉన్న సిక్స్‌ సెన్సెస్‌ రిసార్ట్‌లో వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకు బాలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరయ్యారు.

పెళ్లి నాటికే కత్రినా వయసు 38 సంవత్సరాలు. పెళ్లయిన నాలుగేళ్ళ తర్వాత ఓ శుభవార్తతో సోషల్‌ మీడియా ముందుకు వచ్చింది కత్రినా. ‘కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. మా జీవితంలో అత్యంత అందమైన దశకు స్వాగతం పలుకుతున్నాం’ అంటూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. త్వరలోనే కత్రినా, కౌశల్‌ తల్లిదండ్రులు కాబోతున్నారు. కత్రినా పోస్ట్‌ పెట్టిన తర్వాత ఈ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న కత్రినా ఫొటోలను కూడా షేర్‌ చేశారు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు కత్రినాకు 42 ఏళ్లు. ఈ వయసులో తల్లి అవడం సరికాదని వైద్యులు సూచిస్తుంటారు. కానీ, కత్రినా మాత్రం ఆ సాహసానికి పూనుకుంది. దీని గురించి సోషల్‌ మీడియాలో నెటిజన్లు కూడా ప్రస్తావిస్తున్నారు. తల్లి కావాలన్న కత్రినా సంకల్పమే ఆమెకు అండగా నిలుస్తుందని కొందరు అభిమానులు కామెంట్స్‌ పెడుతూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు.