Read more!

English | Telugu

బెన్నిఫ‌ర్ 2.0: రెండోసారి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న బెన్ అఫ్లెక్‌, జెన్నిఫ‌ర్ లోపెజ్‌

 

హాలీవుడ్ పాపుల‌ర్ స్టార్లు జెన్నిఫ‌ర్ లోపెజ్‌, బెన్ అఫ్లెక్ విడిపోయి, తిరిగి క‌లిసిన ఏడాది లోపే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. రీసెంట్‌గా ఓ వీడియో క్లిప్‌ను ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన లోపెజ్‌, "మీతో ఓ స్పెష‌ల్ స్టోరీని షేర్ చేసుకోవ‌డానికి నిజంగా ఎగ్జ‌యిట్ అవుతున్నాను. మీరు నా అంత‌ర్గ‌త స‌ర్కిల్‌లోని వారు కాన‌ట్ల‌యితే ఇది విన‌డానికి onthejlo.com కు వెళ్లండి" అని రాసుకొచ్చింది. ఆమె న్యూస్‌లెట‌ర్ చ‌ద‌వ‌డానికి ఇమెయిల్ సైన‌ప్ చేసిన‌వాళ్ల‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉన్న‌ప్ప‌టికీ, ఈలోపే ఫ్యాన్స్ లోపెజ్ ధ‌రించిన ఎమ‌రాల్డ్‌-క‌ట్ పేల్ గ్రీన్ రింగ్‌కు సంబంధించిన స్నిపెట్స్‌ను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేశారు.

బెన్‌, లోపెజ్ తొలిసారిగా 2001లో 'గిగ్లీ' మూవీ సెట్స్‌పై క‌లిశారు. అప్పుడే ప్రేమ‌లో ప‌డిన ఆ ఇద్ద‌రూ 2002లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. అయితే వారి పెళ్లి ఆల‌స్యం అయింది. పెళ్లికి ముందే 2004లో ఇద్ద‌రూ విడిపోయారు. ఆ త‌ర్వాత మార్క్ ఆంథోనీని లోపెజ్‌, జెన్నిఫ‌ర్ గార్న‌ర్‌ను బెన్ పెళ్లాడారు. గ‌త ఏడాది ఈ ఇద్ద‌రూ త‌మ లైఫ్ పార్ట‌న‌ర్స్‌తో విడిపోయారు. లోపెజ్ గ‌తంలో అలెక్స్ రోడ్రిగెజ్‌తోనూ డేటింగ్ చేయ‌గా, 'డీప్ వాట‌ర్‌'లో త‌న స‌ర‌స‌న న‌టించిన అనా డి అర్మాస్‌తో కొంత‌కాలం ప్రేమాయ‌ణం న‌డిపాడు బెన్‌.

2004లో వ‌చ్చిన‌ 'జెర్సీ గాళ్' మూవీలో కూడా క‌లిసి న‌టించిన బెన్‌, లోపెజ్‌.. తిరిగి 2021 మే నుంచి మ‌రోసారి రొమాంటిక్ స్టోరీని మొద‌లుపెట్టారు. ఒక మేగ‌జైన్ క‌వ‌ర్ స్టోరీలో లోపెజ్‌ను బెన్ ప్ర‌శంస‌ల్లో ముంచెత్తిన కొద్ది రోజుల‌కే వాళ్ల ప్రేమ‌క‌థ 2.0 స్టార్ట‌యింది. "త‌న ప‌ని విష‌యంలో లోపెజ్ క‌నప‌ర్చే అంకిత‌భావం, సీరియ‌స్‌నెస్‌, త‌న గోల్స్‌ను సాధించుకోవ‌డానికి ఆమె క‌న‌ప‌ర్చే ప‌ట్టుద‌ల‌, దీని కోసం రెట్టింపుగా క‌ష్ట‌ప‌డ్డం నాకు బాగా న‌చ్చుతాయి" అని ఆ సంద‌ర్భంగా చెప్పాడు బెన్‌. "ఇంత‌దాకా నాకు తార‌స‌ప‌డిన వ్య‌క్తులు అంద‌రిలోకీ తీవ్రంగా శ్ర‌మించే వ్య‌క్తి ఆమే"న‌ని కూడా అత‌ను ప్ర‌శంసించాడు.

'బెన్నిఫ‌ర్‌'గా అభిమానులు ముద్దుగా పిలుచుకొనే ఆ ఇద్ద‌రూ గ‌త ఏడాది జెన్నిఫ‌ర్ బర్త్‌డే సంద‌ర్భంగా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్ ద్వారా త‌మ రిలేష‌న్‌షిప్‌ను అఫిషియ‌ల్‌గా తెలిపారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ జంట‌గా ప‌లు ఈవెంట్ల‌లో రెడ్ కార్పెట్‌పై న‌డిచారు. ప్ర‌స్తుతం బెన్ అఫ్లెక్ వ‌య‌సు 49 ఏళ్ల‌యితే, జెన్నిఫ‌ర్ లోపెజ్ వ‌య‌సు 52 సంవ‌త్స‌రాలు.