Read more!

English | Telugu

బాలీవుడ్ `అప‌రిచితుడు`గా ర‌ణ్ వీర్ సింగ్?

సెన్సేష‌నల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ స్థాయిని పెంచిన చిత్రాల్లో `అనియ‌న్` (తెలుగులో `అప‌రిచితుడు`) ఒక‌టి.  చియాన్ విక్ర‌మ్ కెరీర్ లో `ది బెస్ట్` మూవీగానూ నిలిచిందీ సినిమా. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించిన ఈ సోష‌ల్ డ్రామా.. హిందీలోనూ `అప‌రిచిత్`గా అనువాద‌మై ఆద‌ర‌ణ పొందింది.

క‌ట్ చేస్తే.. దాదాపు 16 ఏళ్ళ త‌రువాత ఇప్పుడీ సినిమాని హిందీలో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ మేర‌కు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు టాక్. అంతేకాదు.. బాలీవుడ్ క్రేజీ స్టార్ ర‌ణ్ వీర్ సింగ్ ని ఈ రీమేక్ లో న‌టింప‌జేసేందుకు ప్లానింగ్ జ‌రుగుతోందట‌. అలాగే.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ని డైరెక్ట్ చేసిన శంక‌ర్ నే రీమేక్ చేయాల్సిందిగా కోరుతున్న‌ట్లు టాక్. త్వ‌ర‌లోనే `అప‌రిచితుడు` హిందీ రీమేక్ పై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి.. మ‌ల్టి ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ ఉన్న క‌థానాయ‌కుడి పాత్ర‌లో ర‌ణ్ వీర్ ఏ స్థాయిలో మెస్మ‌రైజ్ చేస్తారో చూడాలి.

కాగా, శంక‌ర్ ప్ర‌స్తుతం మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ చేసే ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ప‌ట్టాలెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. 2022 ద్వితీయార్ధంలో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.