English | Telugu
అక్షయ్ సినిమాకి అనిరుధ్ బాణీలు
Updated : Apr 23, 2021
"వై దిస్ కొలవెరి కొలవెరి డి" అంటూ దాదాపు దశాబ్దం క్రితం యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనిరుధ్. కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన తమిళ చిత్రం '3'తో స్వరంగేట్రం చేసిన అనిరుధ్.. మొదటి ప్రయత్నం(పాట)తోనే యావత్ భారతదేశాన్ని తన బాణీతో మెస్మరైజ్ చేశాడు. ఆపై పలు తమిళ చిత్రాలతో కోలీవుడ్‌లో స్టార్ కంపోజర్ అనిపించుకున్న అనిరుధ్.. తెలుగులోనూ 'అజ్ఞాతవాసి', 'జెర్సీ', 'గ్యాంగ్ లీడర్' వంటి సినిమాలతో తనదైన ముద్రవేశాడు.
కట్ చేస్తే.. త్వరలో అనిరుధ్ బాలీవుడ్ బాట పట్టనున్నట్టు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. స్టార్ హీరో అక్షయ్ కుమార్, వెర్సటైల్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్ కాంబినేషన్‌లో 'అత్రంగి రే' తరువాత `రక్షా బంధన్` పేరుతో మరో సినిమా రానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ స్వరాలు సమకూర్చనున్నట్లు వినికిడి.
వాస్తవానికి చియాన్ విక్రమ్ నటించిన మల్టిలింగ్వల్ మూవీ 'డేవిడ్'కి అనిరుధ్ ఒక పాట కోసం బాణీని అందించాడు. హిందీలోనూ ఈ సినిమా రిలీజైంది. అయితే పూర్తిస్థాయిలో ఒక బాలీవుడ్ మూవీకి అనిరుధ్ ట్యూన్స్ కట్టనుండడం ఇదే తొలిసారి. త్వరలోనే అనిరుధ్ బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.