English | Telugu

రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీలో అన‌న్య‌

ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టిస్తున్న సినిమా రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హానీ. ఆలియా భ‌ట్ నాయిక‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ ఇవాళ విడులైంది. ట్రైల‌ర్‌కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. రెండు రాష్ట్రాల‌కు సంబంధించిన వ్య‌క్తులు, వారి ఆచార వ్య‌వ‌హారాలు, ప్రేమ‌, పెళ్లి, పెద్ద‌లు, కుటుంబాలు... ఇలాంటి విష‌యాల‌తో సాగింది ట్రైల‌ర్‌. డైలాగులు యూత్‌తో పాటు, ఫ్యామిలీని మెప్పించేలా ఉన్నాయి. ఈ నెల 28న విడుద‌ల కానుంది రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ క‌హాని. క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఏడో సినిమా ఇది. గ‌ల్లీబోయ్ త‌ర్వాత ర‌ణ్‌వీర్ సింగ్‌, ఆలియా క‌లిసి న‌టిస్తున్నారు. ఇందులో ర‌ణ్‌వీర్‌, ఆలియాకు మ‌ధ్య ఉన్న లిప్ లాక్ నెటిజ‌న్ల‌కు షాక్ ఇచ్చింది. పెళ్లి త‌ర్వాత న‌టించిన ఆలియా, కిస్ సీన్ల‌కు అబ్జెక్ష‌న్ చెప్ప‌లేద‌న్న విష‌యం ఈ ట్రైల‌ర్ తో స్ప‌ష్ట‌మైంది.

దీంతో పాటు నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించిన మ‌రో విష‌యం అన‌న్య పాండే. ఈ సినిమాలోని ఓ పాట‌కు ర‌ణ్ వీర్ ప‌క్క‌న డ్యాన్స్ చేస్తూ క‌నిపించారు అన‌న్య‌. పెప్పీ సాంగ్‌కి రెడ్ షిమ్మ‌రీ ఔట్‌ఫిట్‌లో అన‌న్య వేసిన స్టెప్పులు అట్రాక్ట్ చేస్తున్నాయి. అన‌న్య ప్రెజెన్స్ ని క‌ర‌ణ్ స‌ర్‌ప్రైజ్‌గా ప్లాన్ చేసినా, ట్రైల‌ర్‌ని గ‌మ‌నించిన వారు మాత్రం ఇట్టే ప‌ట్టేసుకున్నారు. ఈ చిత్రంలో ధ‌ర్మేంద్ర‌, ష‌బానా ఆజ్మీ, జ‌యా బ‌చ్చ‌న్ కీ రోల్స్ చేస్తున్నారు. ట్రైల‌ర్ అతి త‌క్కువ టైమ్‌లోనే ఎక్కువ వ్యూస్‌, లైక్స్ తెచ్చుకుంది. గ‌త వారం విడుద‌లైన తుమ్‌క్యా మిలే పాట‌కు కూడా చాలా బెస్ట్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆలియా త‌ల్ల‌యిన త‌ర్వాత నాలుగు నెల‌లు గ్యాప్ తీసుకుని, ఈ పాట కోసం ప‌నిచేశారు.