English | Telugu
బాగోలేనని బాధపడ్డ అనన్య పాండే లవర్!
Updated : Sep 10, 2023
అర్రే... అలా ఎలా జరిగిందిరా భయ్.. అనాలనిపించేలా ఉంటాయి కొన్ని విషయాలను వింటున్నప్పుడు. రీసెంట్‌గా ఆదిత్యరాయ్ కపూర్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా అలాంటి మాటనే చెప్పారు. అనన్య పాండే బోయ్‌ఫ్రెండ్‌గా మనకు ఆదిత్యరాయ్ కపూర్ సుపరిచితుడే. బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటారు.
రీసెంట్‌గా ఆయన నటించిన ది నైట్ మేనేజర్ 2 కూడా బాలీవుడ్ జనాలను, వెబ్ సీరీస్ లవర్స్ ని ఫిదా చేసింది. సిక్స్ ఫీట్స్ కి పైగా ఎత్తు, పర్ఫెక్ట్ జిమ్ ఫిజిక్‌తో చూడగానే వావ్ అనిపిస్తారు ఆదిత్యరాయ్ కపూర్. ఇటీవల ఆయన చెప్పిన కొన్ని విషయాలు విన్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించింది.
ఆదిత్యరాయ్ కపూర్ మాట్లాడుతూ ``నాకు చాలా సెల్ఫ్ డౌట్స్ ఉండేవి. కొన్ని సార్లు నేను లావుగా ఉన్నానా అనిపించేది. కొన్నిసార్లయితే నేను ఇంతేనా అనిపించేది. కొన్నిసార్లు మామూలుగా, సరాసరిగా ఉన్నానేమో అనే భావన కూడా వచ్చేది. ఇవన్నీ పర్స్పెక్టివ్ మీద ఆధారపడి ఉంటాయని అప్పుడు అర్థం కాలేదు. అందంగా లేనేమో అనే భావన, నేను అన్నీ రోజులు సిక్స్ ప్యాక్‌లు మెయింటెయిన్ చేయలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో నన్ను జనాలు ఎలా చూస్తారు? అనే భావన.. ఇలా చాలా పట్టి పీడించేవి. బరువు తగ్గాలి. స్లిమ్‌గా ఉండాలనే ఫీలింగ్ నాలో చాలా చాలా ఉండేది. నాకే కాదు, చాలా మంది నటులకు అందంగా కనిపించాలనే ప్రెజర్ ఉంటుంది. కేరక్టర్ డిమాండ్ చేసినప్పుడు కాసింత బరువు పెరగడానికి, కాసింత బరువు తగ్గడానికి నాకేం ఇబ్బంది లేదు. కానీ నా ఫిజిక్‌ని చూసి వస్తున్న కేరక్టర్లు చూసినప్పుడు నాకు బోర్ కొడుతుంది. కొన్ని స్టీరియో టైప్ రోల్స్ చేసినప్పుడు బోరింగ్‌గా అనిపిస్తుంది. అలాంటి కేరక్టర్లకు నో చెప్పేస్తున్నాను`` అని అన్నారు ఆదిత్యరాయ్ కపూర్. ప్రస్తుతం అనురాగ్ బసు మెట్రోలో నటిస్తున్నారు ఆదిత్య రాయ్ కపూర్.