Read more!

English | Telugu

ఇంట‌ర్నెట్‌ను ఊపేస్తోన్న ఆలియా-ర‌ణ‌బీర్ పెళ్లి ఫొటోలు

 

గురువారం బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్‌ రణబీర్ కపూర్ ముంబైలో జరిగిన ప్రైవేట్ వేడుకలో అందాల తార ఆలియా భట్‌ను వివాహం చేసుకున్నాడు. వారి వివాహం చాలా కాలంగా ఎదురుచూసిన ఈవెంట్‌లలో ఒకటి. అభిమానులు రణబీర్, ఆలియా ఎప్పుడు వివాహం చేసుకుంటారా అని వేయిక‌ళ్ల‌తో ఎదురుచూస్తూ వ‌చ్చారు. ఆలియా భట్, రణబీర్ కపూర్ తమ పెళ్లి తర్వాత కెమెరాలకు ఇచ్చిన పోజులు ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి.

కరణ్ జోహార్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, నవ్య నవేలి నందా, శ్వేతా బచ్చన్, కరిష్మా కపూర్‌లతో సహా ప్రముఖులు కూడా వారి వివాహ వేడుకలకు హాజరయ్యారు. పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఎనిమిది ఫొటోల‌ను ఆలియా త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ఆలియా, ర‌ణ‌బీర్ కొత్త దంప‌తుల దుస్తుల్లో మెరిసిపోతూ, ఒక‌రిపై మ‌రొక‌రి ప్రేమ‌ను చూపుల‌తో, న‌వ్వుల‌తో ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

"ఈరోజు, మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ స‌మ‌క్షంలో గ‌త ఐదేళ్లుగా అనుబంధంలో ఉంటూ మేం గడుపుతూ వ‌చ్చిన మా ఫేవ‌రేట్ స్పాట్ బాల్క‌నీలో మేం పెళ్లి చేసుకున్నాం. ఇప్ప‌టికే ఎన్నో జ్ఞాప‌కాల‌ను క‌లిసి నిర్మించుకున్న మేం, మ‌రిన్ని జ్ఞాప‌కాల‌ను నిర్మించుకోవ‌డానికి దంప‌తుల‌మ‌య్యాం. మా జ్ఞాప‌కాల్లో ప్రేమ‌, న‌వ్వులు, సౌక‌ర్య‌వంత‌మైన నిశ్శ‌బ్దాలు, సినిమాల‌కెళ్లిన రాత్రులు, సిల్లీ ఫైట్లు, వైన్ డిలైట్స్‌, చైనీస్ బైట్స్ లాంటివి ఉన్నాయి. మా జీవితాల్లో అత్యంత మ‌ధుర‌మైన క్ష‌ణాల్లో మీరు చూపించిన ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. ఈ క్ష‌ణాలు మ‌రింత స్పెష‌ల్‌గా మారాయి. ప్రేమ‌తో ర‌ణ‌బీర్‌-ఆలియా" అంటూ రాసుకొచ్చింది ఆలియా.