English | Telugu

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి కన్నుమూత

బాలీవుడ్ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

ఇటీవల 'సిండ్రెల్లా' మూవీ షూటింగ్ కోసం లండన్‌ వెళ్ళిన అక్షయ్.. తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే ముంబైకి తిరిగి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని హిరానందాని ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం ఆమె కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్షయ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. "ఆమె నా బలం. ఆమె ఇక లేరనే విషయం తెలిసి భరించలేంత నొప్పిని అనుభవిస్తున్నాను. మా అమ్మ శ్రీమతి అరుణ భాటియా ఈరోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి.. పరలోకంలో ఉన్న మా నాన్నను కలవడానికి వెళ్లారు. నేను, నా కుటుంబం అత్యంత విషాదంలో ఉన్న సమయంలో మీరు మాకోసం చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు. ఓం శాంతి" అంటూ అక్షయ్‌ ట్వీట్‌ చేశారు.

కాగా అక్షయ్‌ తల్లి మరణించారన్న వార్త తెలియడంతో ప్రముఖులు సహా నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్‌ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.