Read more!

English | Telugu

184 సెల్ఫీల‌తో అక్ష‌య్‌కుమార్ వ‌ర‌ల్డ్ రికార్డ్!

ఒక వ్య‌క్తి నిమిషానికి ఎన్ని సెల్ఫీలు తీయ‌గ‌ల‌రు? ఒక్క‌రే ఉంటే ఎన్ని తీసుకోగ‌ల‌రు? ప‌క్క‌న ఇంకెవ‌రైనా ఉంటే ఎన్ని ట్రై చేయ‌గ‌ల‌రు. ప‌క్క‌నున్న‌ది ఫ్యాన్స్ అయితే, వ‌చ్చి నిలుచున్నాక అక్క‌డి నుంచి క‌ద‌ల‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌నివారైతే, అప్పుడు ప‌రిస్థితి ఏంటి? ఇలాంటి ప్ర‌శ్న‌లు మీకు మీరే వేసుకోండి. ద‌య‌చేసి న‌న్ను మాత్రం అడ‌గ‌కండి అని అంటున్నారు ఖిలాడీ స్టార్.

అక్ష‌య్‌కుమార్ లేటెస్ట్ గా సెల్ఫీలు తీసుకోవ‌డంలో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు. మూడు నిమిషాల్లో 184 సెల్ఫీలు తీసుకుని రికార్డు సృష్టించారు. ఇంత‌కు పూర్వం ఈ రికార్డు యుఎస్ఏకి చెందిన జేమ్స్ స్మిత్ పేరు మీద ఉంది. ఆయ‌న నిమిషానికి 168 సెల్ఫీలు తీసుకున్నార‌ట‌. అంత‌కు ముందు 2015లో హాలీవుడ్ యాక్ట‌ర్ జాన్స‌న్ పేరుమీద ఉంది ఈ రికార్డు. లండ‌న్‌లోని శాన్ యాండ్రియాస్‌లో జ‌రిగిన ప్రీమియ‌ర్‌లో ఫ్యాన్స్ తో మూడు నిమిషాల‌కు 105 సెల్ఫీలు తీసుకున్నారు జాన్స‌న్‌.లేటెస్ట్ గా తాను సెల్ఫీలు తీసుకోవ‌డంలో రికార్డు క్రియేట్ చేయ‌డం గురించి మాట్లాడారు. ``అస‌లు ఇలాంటి రికార్డు సెట్ చేస్తాన‌ని నేనెప్పుడూ అనుకోలేదు. మామూలుగా నా జీవితంలో నేను ఇంత ఎద‌గ‌డానికి కార‌ణం నా అభిమానులు. ఇప్పుడు ఈ గిన్నిస్ రికార్డు విష‌యంలోనూ వారు నా ప‌క్క‌న ఉండ‌టం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రికార్డుకు వారు ప్ర‌త్య‌క్ష సాక్షులు. వారికే దీన్ని అంకితం చేస్తున్నాను. ఇలాంటి అరుదైన రికార్డు అభిమానుల‌తో క‌లిసి సాధించ‌డం ఆనందంగా ఉంది`` అని అన్నారు.

ప్ర‌స్తుతం సెల్ఫీ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ఉన్నారు అక్ష‌య్‌కుమార్‌. ఈ సినిమాలో డ‌యానా పెంటీ, న‌ష్ర‌త్ బ‌రూచా కీ రోల్స్ చేస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల కానుంది ఈ సినిమా.ఈ చిత్రంతో పాటు యామీగౌత‌మ్‌తో ఓ మై గాడ్‌2లోనూ న‌టిస్తున్నారు అక్కీ భాయ్‌. హెరాఫెరీ3 షూటింగ్ ఇటీవ‌ల మొద‌లైంది. మ‌రో మ‌రాఠీ సినిమాలోనూ కీ రోల్ చేస్తున్నారు.