English | Telugu

దీపావ‌ళికి 'హ్యాపీ న్యూ ఇయ‌ర్' విషెస్ చెప్పిన అజ‌య్ దేవ్‌గ‌ణ్‌!

అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, కాజోల్ దంప‌తులు ఇన్‌స్టాగ్రామ్‌లో త‌మ దీపావ‌ళి వేడుక సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన గ్లిమ్స్‌ను పంచుకున్నారు. భ‌ర్త‌, కొడుకు యుగ్‌తో క‌లిసున్న ఒక ఫొటోను షేర్ చేసిన కాజోల్‌, "అంద‌రికీ వెరీ వెరీ హ్యాపీ దీవాళీ. ఇవాళ నా బేబీ గాళ్ (నైసా) చాలా మిస్స‌వుతున్నా. #familyfirst #silentcelebrations #funfoodandpeople." అని రాసుకొచ్చింది. ఈ ఫొటోలో కాజోల్ వైట్ అండ్ రెడ్ శారీ ధ‌రించ‌గా, తండ్రీకొడుకులు అజ‌య్ యుగ్ ఇద్ద‌రూ వ‌యొలెట్ క‌ల‌ర్ మ్యాచింగ్ కుర్తా వేసుకున్నారు. ఆ ఫొటో చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫాలోవ‌ర్స్‌.

త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌.. కొడుకు యుగ్‌, త‌న‌ సోద‌రి నీల‌మ్ దేవ్‌గ‌ణ్ కుమారులు అమ‌న్ గాంధీ, డానిష్ గాంధీల‌తో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దానికి, "కొత్త ప్రారంభాలు. పాత సంప్ర‌దాయాలు. మీకు, మీ కుటుంబానికి వెరీ హ్యాపీ న్యూ ఇయ‌ర్" అనే కాప్ష‌న్ పెట్టాడు. అది చూసి, ఇప్పుడు కొత్త సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లేమిటా అని ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. దీపావ‌ళిని కొత్త సంవ‌త్స‌రంగా అజ‌య్ భావించుకొని అలా పెట్టివుంటాడ‌ని కొంత‌మందీ, దీపావ‌ళి విషెస్ చెప్ప‌బోయి పొర‌పాటున అలా పెట్టివుంటాడ‌ని ఇంకొంత‌మందీ కామెంట్లు విసిరారు.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.