English | Telugu
టైప్‌కాస్ట్ నచ్చదంటున్న అనన్య బోయ్‌ఫ్రెండ్!
Updated : Jul 13, 2023
లైగర్ బ్యూటీగా అనన్య పాండే మనకు బాగా తెలుసు. ఆమె బోయ్‌ఫ్రెండ్‌గా కావాల్సినంత ఫేమ్ పోగేసుకున్నారు ఆదిత్యరాయ్ కపూర్. ఆయన నటించిన ది నైట్‌మేనేజర్ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఇప్పటిదాకా మిగిలిన షోస్ మీదున్న రికార్డులను కొల్లగొట్టేస్తోంది. ఈ షో గురించి ఆదిత్య రాయ్ కపూర్ చాలా విషయాలను చెప్పుకొచ్చారు. తన వ్యక్తిత్వం, అభిరుచుల గురించి కూడా మాట్లాడారు.
ఆదిత్య మాట్లాడుతూ ``ఇప్పటిదాకా నన్ను జనాలు చూసిన తీరు వేరు, నైట్ మేనేజర్‌లో చూసిన తీరు వేరు. నేను ఇలాంటి పాత్రల్లో చేయగలను అని ఎవరూ ఊహించలేదు. కానీ చేయగలననే నమ్మకం నాది. ఇప్పుడు ఒక అవకాశం రావడంతో అందరి దృష్టీ పడింది. ఇప్పుడు ఈ ఫార్ములా సక్సెస్ కావడంతో చాలా మంది ఇలాంటి స్క్రిప్టులతో నన్ను అప్రోచ్ అవుతున్నారు. కానీ, ఒకే రకమైన పాత్రలు చేయడం నాకెప్పుడూ నచ్చదు. ఎప్పటికప్పుడు జోనర్‌ని మార్చుకుంటూ ఉండాలి. అప్పుడే జీవితం హ్యాపీగా ఉంటుంది. చేసిందే చేస్తుంటే, చేయాలన్న ఆసక్తి పోతుంది. చూసేవారికి కూడా బోర్ వచ్చేస్తుంది. నైట్ మేనేజర్ ఒరిజినల్ షో ఇష్టపడేవారు చాలా మంది, ఇప్పుడు నా షో బావుందని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. అలాంటి ఆనందం దక్కుతూ ఉండాలంటే, మనం కచ్చితంగా ఒరిజినాలిటీని మిస్ చేసుకోకూడదు`` అని అన్నారు.
కేరక్టర్‌కి ప్రిపేర్ అయ్యే తీరు గురించి మాట్లాడుతూ ``నేను కథ వినగానే కేరక్టర్ గురించి ఆలోచిస్తాను. నిలుచునే తీరు, మాట్లాడే విధానం, బిహేవియర్ ఇలా ప్రతి విషయం గురించి రిసెర్చ్ చేస్తాను. నేను ఓ కేరక్టర్ చేశానంటే, అందులో జనాలు నన్ను చూడకూడదు. ఆదిత్యను కాకుండా, ఆ కేరక్టర్‌ని చూడాలి. అప్పుడే నేను సక్సెస్ అయినట్టు`` అని అన్నారు హీరో. అనన్యతో కలిసి త్వరలోనే స్పెయిన్ హాలీడే ట్రిప్‌ని ఎంజాయ్ చేయనున్నారు ఆదిత్య.