Read more!

English | Telugu

మహిమ చౌదరికి బ్రెస్ట్ కాన్సర్

ఇటీవల చాలామంది సెలెబ్రిటీస్ కాన్సర్ బారిన పడుతున్నారు. కొంతమంది కోలుకున్నారు. కొంతమంది ఇంకా వారియర్ లా ఫైట్ చేస్తున్నారు. లేటెస్ట్ బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ మహిమ చౌదరి కాన్సర్ బారిన పడ్డారు. ఆమె బ్రెస్ట్ కాన్సర్ తో ఫైట్ చేస్తున్నట్టు అనుపమ్ ఖేర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఐతే "ది సిగ్నేచర్" మూవీలో ఒక రోల్ కోసం మహిమకి కాల్ చేసిన అనుపమ్ ఖేర్ కి మాటల మధ్యలో ఈ విషయాన్నీ చెప్పిందట. ఈ సమాచారం నా ద్వారా ప్రపంచానికి తెలియాలని అనుకుంది మహిమ. కాబట్టి నేను తనకు ధైర్యం చెప్పి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే విషయంలో ఆమె గుండె ధైర్యం గురుంచి నేను పోస్ట్ రాస్తున్నాను అన్నారు ఖేర్.

మహిమ కూడా రిప్లై ఇస్తూ తనకు అసలు కాన్సర్  లక్షణాలు లేవు కానీ కొన్ని టెస్టుల్లో కాన్సర్ ఉన్నట్లు బయటపడింది అని చెప్పింది. ఐతే మూవీస్ లో, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయమంటూ తనకు కాల్స్ వస్తున్నాయని , కానీ తనకు జుట్టు లేదు కాబట్టి యాక్ట్ చేయను అంటూ ఎమోషన్ అయ్యారు. మహిమ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ నెటిజన్స్ ధైర్యం చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కోరుకుంటున్నాం అని మెసేజెస్ పెట్టారు. 1997 లో వచ్చిన పరదేశి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహిమ వయసు ఇప్పుడు 47 ఏళ్ళు.