Read more!

English | Telugu

బాలీవుడ్ ముచ్చ‌ట‌.. జూన్ సెకండాఫ్ లో బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్!

బాలీవుడ్ లో రీమేక్స్ కొత్తేమీ కాదు. అనాదిగా ఉండే వ్య‌వ‌హార‌మే. ఇక ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్ధ‌మైన సినిమాల్లోనూ కొన్ని రీమేక్స్ ఉన్నాయి. మ‌రీముఖ్యంగా.. ఈ జూన్ నెల‌లో రెండు వ‌రుస వారాల్లో ద‌క్షిణాది చిత్రాల తాలూకు రీమేక్స్ సంద‌డి చేయ‌నున్నాయి.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. నేచుర‌ల్ స్టార్ నాని, డాన్సింగ్ క్వీన్ సాయి ప‌ల్ల‌వి, సీనియ‌ర్ హీరోయిన్ భూమికా చావ్లా ప్ర‌ధాన పాత్ర‌ల్లో వేణు శ్రీ‌రామ్ తెర‌కెక్కించిన తెలుగు చిత్రం `మిడిల్ క్లాస్ అబ్బాయి` (ఎంసీఏ) ఎలాంటి విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2017 క్రిస్మ‌స్ కి కాసుల వ‌ర్షం కురిపించిన ఈ ఫ్యామిలీ థ్రిల్ల‌ర్.. ఇప్పుడు `నిక‌మ్మా` పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అయింది. అభిమ‌న్యు ద‌స్సాని, షెర్లీ సేటియా, శిల్పా శెట్టి ముఖ్య పాత్ర‌ల్లో స‌బ్బీర్ ఖాన్ తెర‌కెక్కించిన ఈ చిత్రం జూన్ 17న రిలీజ్ కానుంది. ఇక ఆ సినిమా విడుద‌లైన వారం త‌రువాత అంటే జూన్ 24న `ఫోరెన్సిక్` వ‌స్తోంది. 2020 నాటి మ‌ల‌యాళ చిత్రం `ఫొరెన్సిక్` (టొవినో థామ‌స్, మ‌మ‌తా మోహ‌న్ దాస్ ప్ర‌ధాన పాత్ర‌ధారులు)కి రీమేక్ గా రూపొందిన ఈ విశాల్ ఫురియా డైరెక్టోరియ‌ల్ లో రాధికా ఆప్టే, విక్రాంత్ మ‌స్సీ మెయిన్ లీడ్స్ గా యాక్ట్ చేశారు. ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ సినిమా నేరుగా స్ట్రీమ్ కానుంది. మ‌రి.. రెండు వ‌రుస వారాల్లో వ‌స్తున్న ఈ ద‌క్షిణాది రీమేక్స్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు రంజింపజేస్తాయో చూడాలి.