Read more!

English | Telugu

మా సినిమాలో  ముద్దు సీన్ కి  100 మంది అధికారులు  పర్మిషన్ ఇచ్చారు

ఈ రోజుల్లో లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అన్ని భాషలకి చెందిన సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటున్నాయి. కథ డిమాండ్ మేరకు నటించామని  ఆర్టిస్టులు చెప్తున్నా కూడా ప్రేక్షకులు  అలాంటి సీన్లకి ఎప్పుడో అలవాటు పడిపోయారు.కానీ ఒక వ్యక్తి మాత్రం సినిమాలో ఉన్నముద్దు సన్నివేశం తనని చాలా బాధకి గురిచేసిందని  కొన్ని రోజుల క్రితం ఆ చిత్ర దర్శకుడుకి కోర్ట్ ద్వారా నోటీసులు పంపించాడు.ఇప్పుడు అతనికి  చిత్ర దర్శకుడు తన దైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు.

  మొన్న జనవరి 25 న రిపబ్లిక్ డే కానుకగా వరల్డ్ వైడ్ గా  ఫైటర్ మూవీ రిలీజ్ అయ్యింది.  ఆ మూవీలోని ఒక సీన్ లో హీరో హీరోయిన్లు అయిన హృతిక్ దీపికా లు  లిప్ లాక్ పెట్టుకుంటారు. వాళ్లిద్దరు ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన యూనిఫామ్  వేసుకొని అలా ముద్దుపెట్టుకోవడం ఎయిర్ ఫోర్స్ వృత్తిని  అవమానించడమే అని  అస్సాం కి చెందిన సౌమ్య దీప్ దాస్ చిత్ర దర్శకుడైన సిద్దార్ధ్ ఆనంద్ కి  నోటిసులు పంపించాడు. ఇప్పుడు ఆ నోటీసు పై సిద్దార్ద్ మాట్లాడుతు ఫైటర్ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నప్పటి దగ్గర నుంచి సెన్సార్ రిపోర్ట్ వచ్చేంత వరకు ప్రతి విషయాన్ని ఎయిర్ ఫోర్స్ అధికారులతో చర్చించాం. అలాగే  రిలీజ్ కి ముందు ఎయిర్ ఫోర్స్ చీఫ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న  అత్యున్నతమైన 100 మంది ఎయిర్ ఫోర్స్  అధికారులకి కూడా  ఫైటర్ ని  చూపించామని  ఆయన చెప్పాడు.  వారు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ని ఇచ్చిన తర్వాతనే సినిమాని రిలీజ్ చేశామని కూడా ఆయన చెప్పాడు.

పైగా  కంప్లైట్ ఇచ్చిన వ్యక్తి అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోనే  (ఐఏఎఫ్) లో లేడని సిద్దార్ధ్ చెప్పడం జరిగింది.ఇప్పుడు సిద్దార్ధ్ చెప్పిన ఈ విషయం  సంచలనం సృష్టిస్తుంది. ఇక ఫైటర్ సినిమా దేశవ్యాప్తంగా కూడా నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఇప్పటి వరకు 350 కోట్లు వసూలు చేసింది.