English | Telugu

ఆ రీమేక్ లో ర‌ణ్ వీర్ కి జోడీగా కియారా?

చియ‌న్ విక్ర‌మ్ - సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `అనియ‌న్` (2005). తెలుగులో `అప‌రిచితుడు` పేరుతో అనువాద‌మైన ఈ త‌మిళ చిత్రం.. త్వ‌ర‌లోనే హిందీనాట రీమేక్ కానుంది. బాలీవుడ్ `అప‌రిచితుడు`గా ర‌ణ్ వీర్ సింగ్ ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నార‌ని.. ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈ రీమేక్ ని ప్రొడ్యూస్ చేయ‌నుంద‌ని ఇప్ప‌టికే కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాదు.. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ని తెర‌కెక్కించిన శంక‌ర్.. ఈ రీమేక్ కి కూడా మెగాఫోన్ ప‌ట్టొచ్చ‌ని వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ర‌ణ్ వీర్ సింగ్ కి జోడీగా ఉత్త‌రాది భామ కియారా అద్వానిని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని బ‌జ్. ఒరిజిన‌ల్ లో స‌దా పోషించిన పాత్ర‌లో కియారా అయితేనే బాగుంటుంద‌ని భావిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే `అపరిచితుడు` హిందీ రీమేక్ లో కియారా ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

కాగా, ప్ర‌స్తుతం కియారా చేతిలో `షేర్ షా`, `భూల్ బూల‌య్య 2`, `జ‌గ్ జ‌గ్ జియో` వంటి హిందీ సినిమాలు ఉన్నాయి. వీటిలో `షేర్ షా` జూలై 2న విడుద‌ల కానుండ‌గా.. `భూల్ బూల‌య్య 2` న‌వంబ‌ర్ లో రిలీజ్ కానుంది.

Border 2: ధురంధర్ ని బీట్ చేసిన బోర్డర్ 2 .. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే 

గదర్ 2 ,జాట్ తో హిట్ మోడ్ లోకి వచ్చిన 'సన్నీడియోల్'(Sunnu Deol)నిన్న కొత్త చిత్రం 'బోర్డర్ పార్ట్ 2(Border 2)'తో వరల్డ్ సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. 1997 లో సన్నీడియోల్, జాకీష్రఫ్, సునీల్ శెట్టి, అక్షయ్ కన్నా హీరోలుగా వచ్చిన బోర్డర్ కి సీక్వెల్ గా బోర్డర్ 2 తెరకెక్కింది. సీక్వెల్ లో ఈ సారి  వరుణ్ ధావన్, ఆహాన్ శెట్టి, ధీల్జిత్ ధీసాంజ్ లు సన్నీడియోల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.  మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తొలి రోజు కలెక్షన్స్ కి సంబంధించి ధురంధర్ ని బీట్ చెయ్యడం అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.