Read more!

English | Telugu

ఆశా ప‌రేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డుకు బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి ఆశా ప‌రేఖ్ ఎంపిక‌య్యారు. 2020కి గాను ఆశా ప‌రేఖ్ ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

 

1942, అక్టోబర్ 2 న గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఆశా ప‌రేఖ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. 1960, 70ల సమయంలో టాప్ హీరోయిన్ గా ఉన్నారు. వెండితెరపై చెరగని ముద్రవేసిన ఆమె బుల్లితెరపైనా దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటారు. 1992లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇక ఇప్పుడు ఆమె దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక‌య్యారు. 68వ జాతీయ చ‌ల‌న‌చిత్ర పుర‌స్కారాల్లో భాగంగా ఈ నెల 30న ఆశా ప‌రేఖ్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రధానం చేయనుంది.