English | Telugu

మేము శ్రీకృష్ణుడి భక్తులం.. ఫర్హాన్ అక్తర్ సంచలనం 

దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా 'ఫర్హాన్ అక్తర్'(Farhan Akhtar)సినీ జర్నీకి ఎంతో ఘనమైన పేరు ఉంది. ఆ మూడు విభాగాల్లోను సుదీర్ఘ కాలం నుంచి ఫర్హాన్ అక్తర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే నిర్మాతగా ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)తో 'గ్రౌండ్ జీరో' అనే యాక్షన్ థ్రిల్లర్ తో పాటు, 'సాంగ్స్ ఆఫ్ పారడైజ్' అనే బయోగ్రాఫికల్ మ్యూజిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు '120 బహుదూర్' అనే పీరియాడిక్ వార్ మూవీతో సిద్ధమవుతున్నాడు.

ఈ చిత్రానికి ఫర్హాన్ అక్తర్ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజయ్యింది. 1962 వ సంవత్సరంలో ఇండియా, చైనా మధ్య జరిగిన లెజింగా యుద్ధంలో పోరాడిన వీర సైనికులకి నివాళి అని పేర్కొనడంతో పాటు, లెజండ్రీ గాయనీ 'లతా మంగేష్కర్'(Lata mangeshkar)గారి గాత్రం నుంచి వెలువడిన 'ఏ మేరే వతన్ కె లోగో'తో టీజర్ ప్రారంభమైంది. మన సైనికులు, చైనా సైనికులతో తుపాకులతో తమ ప్రాణాలకి తెగించి పోరాడుతుంటే వాయిస్ ఓవర్ లో మీరందరు రైతు బిడ్డలు, మీ పూర్వికులు కరువు, వరదలతో పోరాడటం మీరు చూసారు. మీ భూమి కోసం పోరాటం మీ రక్తంలోనే ఉంది. ఈ సారి పోరాటం భూమి కోసం కాదు,మాతృభూమి కోసం. మేము సైనికులం, శ్రీకృష్ణుడి(Sri Krishnudu)భక్తులం. యుద్దానికి వెళ్లే ముందుకు ఆయన పేరుని తలచుకుంటాం. భరత మాత ఒక్కో ముద్దుబిడ్డ వంద మందికి సమానం వంటి డైలాగులు మూవీపై అంచనాలు పెంచాయి.

లెజింగా యుద్దానికి నాయకత్వం వహించిన 'మేజర్ షైతాన్ సింగ్' జీవిత కథ ఆధారంగా 120 బహుదూర్ తెరకెక్కగా, రాశి ఖన్నా(Rashikhanna)హీరోయిన్ గా చేస్తుంది. ఫర్హాన్ అక్తర్ తో పాటు రితేష్ సిద్వానీ, అమిత్ చంద్ర కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా 'రజనీష్ ఘాయ్'(Razneesh Ghai)దర్శకుడు. నవంబర్ 21 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. అమిత్ త్రివేది(Amith Trivedi)మ్యూజిక్ ని అందిస్తున్నాడు.